హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సలార్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే 85 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సలార్ మూవీ తాజా షెడ్యూల్ ఈనెల 8వ తారీకు నుండి ప్రారంభం అయ్యింది. చిత్రబృందం షూటింగ్కు కాస్త విరామం ఇచ్చింది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రభాస్.. సలార్ షూటింగ్లో పాల్గొనే అవకాశముందనీ.. ఇంకో 30 నుంచి 35 రోజుల షూటింగ్ జరిగితే సినిమా పూర్తవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. సలార్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: