గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రామబాణం. లక్ష్యం, లౌక్యం సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ,తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేదేఖర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు
డైరెకర్.. శ్రీవాస్
బ్యానర్స్..పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు.. విశ్వప్రసాద్
సంగీతం..మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫి..వెట్రి పళనిసామి
కథ
రఘుదేవపురం లో రాజారాం(జగపతిబాబు) విలువలతో మెలిగే వక్తి. తను ఓ హోటల్ కూడా నడుపుతుంటాడు. తన హోటల్ లో ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే అందిస్తుంటాడు. ఇక అదే ఊరిలో పాపారావు (నాజర్) రాజారాం కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుంటాడు. దాంతో రాజారాం తమ్ముడు విక్కీ (గోపీచంద్) పాపారావుతో గొడవపడతాడు. అందుకుగాను జగపతిబాబు గోపీచంద్ పై కోప్పడతాడు. దాంతో ఇంటినుండి బయటకు వెళతాడు విక్కీ. అలా వెళ్లిన విక్కీ పెద్ద డాన్ అవుతాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో మళ్లీ ఇంటికి రావాల్సి వస్తుంది.. మరి గోపీచంద్ మళ్లీ వెనక్కి రావడానికి కారణమేంటి? వచ్చాక ఏమౌతుంది? అనేది మిగతా కథ.
విళ్లేషణ
అన్నదమ్ముల సెంటిమెంట్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అంతేకాకుండా హీరోకి ఉన్న బ్యాక్ గ్రౌండ్ ను దాచిపెట్టి వచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇక ఈసినిమాను కూడా అదే పాయింట్ కానీ కథ, కథాంశం మాత్రం డిఫరెంట్ గా రాసుకున్నాడు. అందులోనూ గోపీచంద్ తో వస్తున్న సినిమా కాబట్టి మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఈసారి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. అంతేకాదు స్వచ్ఛమైన ఆహారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత ఉపయోగకరం, దాని ప్రాముఖ్యత ను వివరించడం అనేది గొప్ప విషయం. దానితోపాటు సినిమాలో అన్నదమ్ముల అనుబంధం, కుటుంబం ఐక్యత గురించి కూడా చాలా బాగా చెప్పాడు.
పెర్ఫామెన్స్
గోపీచంద్ కు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. అంతకుముందే చేసేశాడు. ఇప్పుడు ఈసినిమాలో కూడా చాలా ఈజ్ తో చేసుకుంటూ వెళ్లాడు. డ్యాన్సుల్లో, యాక్షన్ సీక్వెన్స్ ల్లో చాలా కష్టపడ్డాడు. ఇక జగపతిబాబు కూడా చాలా బాగా చేశాడు. రాజారాం పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. తన వల్ల ఆ పాత్రకు హుందాతనం వచ్చిందని చెెప్పొచ్చు. ఆయనకు పోటీ ఇచ్చే పాత్రలో నాజర్ కూడా విలనిజం బాగానే పండించాడు. ఖుష్బూ కూడా తన పాత్రకు కరెక్ట్ గా సెట్ అయింది. డింపుల్ హయాతి తన గ్లామర్ తో మెప్పించింది. మిగిలిన నటీనటులందరు తమ పాత్రల మేర నటించారు.
టెక్నికల్ వాల్యూస్
సినిమా టెక్నికల్ వాల్యూస్ కూడా బాగున్నాయి. పాటలు ఓకే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి..
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.