ట్యాగ్ · 95 కథనాలు · పేజీ 5
అల్లు అర్జున్ అద్భుతమైన డ్యాన్సర్ - దిశా పటాని
అల్లు అర్జున్ సింపుల్ &స్వీట్ - రష్మిక
"సరైనోడు" టీమ్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు
'బన్నీ' గుండెలపై 'అర్హ'

"పుష్ప "లో పల్లెటూరి యువతిగా రష్మిక
'ఐకాన్' పై దిల్ రాజు క్లారిటీ
'ఐకాన్' కు మంచి స్టోరీ లైన్ ఉంది
"అల ..వైకుంఠపురములో.. " సెన్సేషనల్ రికార్డ్

కొరటాలతో బన్నీ సినిమాపై నిర్మాతల క్లారిటీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
నేను కోలుకుంటున్నా - అల్లు అర్జున్
టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరుపొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
అల్లు అర్జున్ అద్భుతమైన డ్యాన్సర్ - దిశా పటాని
"లోఫర్ " మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దిశా పటాని బ్లాక్ బస్టర్ "ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ "మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. జాకీ చాన్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ "కుంగ్ ఫు యోగా "చైనీస్ మూవీ తో దిశా ప్రేక్షకులను అలరించారు. దిశా కథానాయికగా రూపొందిన "బాఘీ 2", "భరత్ ", "మలంగ్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. దిశా ప్రస్తుతం "రాధే ", "ఏక్ విలన్ రిటర్న్స్ " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
'పుష్పరాజ్' కు తప్పని కరోనా
మెగా హీరోల్లో ఇప్పటికే చాలామంది కోరనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే చాలామంది హీరోలు తమ షూటింగ్ లను ఆపేసుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమాను అనుకున్న టైమ్ కే రిలీజ్ చేయాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పుష్ప షూటింగ్ ను ఆపలేదు. అయితే ఇప్పుడు బన్నీకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది.

పుష్పరాజ్ సరికొత్త రికార్డ్.. ఇంట్రడక్షన్ @50 మిలియన్స్
తగ్గేదే లే.. ఇది పుష్ప సినిమాలో బన్నీ చెప్పే డైలాగ్. ఇక అలాగే బన్నీ కూడా నిజంగానే తగ్గేలా కనిపించడంలేదు. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ లుక్, టీజర్ ఇలా అన్నీ ఆకట్టుకోవడం, బన్నీ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అసలే ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి... ఈఒక్క టీజర్ తో ఆ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లారు. ఇక బన్నీకి రికార్డులు కొత్తేమీకాదు. అలవైకుంఠపురములో పాటలు అయితే ఏడాది అవుతున్నా ఇప్పటికీ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ఇక పుష్ప ఫస్ట్ లుక్ తోనే…
అల్లు అర్జున్ సింపుల్ &స్వీట్ - రష్మిక
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఫాహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సీటీమార్ లో డ్యాన్స్, స్టైల్ అదిరిపోయాయి బ్రదర్..!
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా రాధేశ్యామ్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక సీటీమార్ పాటతో ఈసినిమా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'DJ-దువ్వాడ జగన్నాథం' చిత్రం కోసం దేవిశ్రీ కంపోజ్ చేసిన 'సీటీమార్' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట బాగా నచ్చి సల్మాన్ రీమిక్స్ చేయమని కోరడంతో.. దేవిశ్రీ హిందీలో ఈ పాటను మళ్ళీ కంపోజ్ చేశారు. ఈపాట ఇప్పుడు యూట్యూబ్లో హల్ చల్ చేస్తుంది.
"సరైనోడు" టీమ్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరైనోడు"మూవీ 2016 సంవత్సరం ఏప్రిల్ 22 వ తేదీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. రకుల్ ప్రీత్ సింగ్ , కేథరిన్ ట్రెసా కథానాయికలు. హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. శ్రీకాంత్ , ఆది పినిశెట్టి ముఖ్యపాత్రాలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫైట్స్ , డ్యాన్స్ లలో తనదైన మార్క్ తో అల్లు అర్జున్ ప్రేక్షకులను అలరించారు.
యూట్యూబ్ లో అల్లు అర్జున్ 'డీజే' సరికొత్త రికార్డ్
మన తెలుగు సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్య కాలంలో అలా చాలా సినిమాలకే జరిగింది. ఇక తెలుగు సినిమాలు హిందీ లో డబ్బింగ్ అయి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా మిలియన్ వ్యూస్ తోదూసుకుపోతున్నాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమా 100 మిలియన్స్ ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
'బన్నీ' గుండెలపై 'అర్హ'
అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటాడో.. ఫ్యామిలీ కి కూడా అంతే టైమ్ కేటాయిస్తాడు. ఇక షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ దొరికితే చాలు అర్హ, అయాన్లతో కలిసి సందడి చేస్తుంటాడు. మరోవైపు అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే అల్లరి, వాటికి సంబంధించిన క్యూట్ వీడియోలను ఎప్పటికప్పుడు అల్లు అర్జున్, స్నేహ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. తాజాగా స్నేహ బన్నీ- అర్హ కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో చూడటానికి క్యూట్ గా ఉండి ఆకట్టుకుంటుంది. దీనితో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

"పుష్ప "లో పల్లెటూరి యువతిగా రష్మిక
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పలు భాషల బిజీ హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో , నేషనల్ అవార్డ్ విన్నర్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
'ఐకాన్' పై దిల్ రాజు క్లారిటీ
చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా సరే దిల్ రాజు కమిట్ అయ్యాడంటే అది దాదాపు పూర్తయినట్టే. సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టే నిర్మాతల్లో ఒకడు కాబట్టే టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గానే వకీల్ సాబ్ సినిమాతో మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా తన నిర్మాణంలో పెండింగ్ లో ఉన్న ఐకాన్ పై ఇప్పుడు నోరు విప్పాడు దిల్ రాజు.
'ఐకాన్' కు మంచి స్టోరీ లైన్ ఉంది
మొత్తానికి ఏది ఎలా ఉన్నా ఈసారి పరిస్థితులు బన్నీ ఐకాన్ సినిమాకు మాత్రం కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈసినిమా ఇంతవరకూ ఆ అదృష్టానికి నోచుకోలేదు. సినిమాను అయితే ఎప్పుడో ప్రకటించారు కానీ అప్పటినుండి ఎవరు చెప్పినా సినిమా పక్కా ఉంటుంది.. ఉంటుంది అంటున్నారే తప్పా ట్రాక్ లోకి తీసుకురావడంలేదు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఈ సినిమానే చేస్తాడని అప్పుడు అందరూ అనుకున్నారు కానీ.. దాన్ని పక్కన పెట్టి ‘అల వైకుంఠపురములో’ను లైన్లో పెట్టేశాడు. ఈసినిమా తరువాత అయినా చేస్తాడనుకుంటే వెంటనే పుష్ప సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
"అల ..వైకుంఠపురములో.. " సెన్సేషనల్ రికార్డ్
గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల ..వైకుంఠపురములో.. "మూవీ 2020 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టబు , సుశాంత్ , నివేత పేతురాజ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

కొరటాలతో బన్నీ సినిమాపై నిర్మాతల క్లారిటీ
గత కొద్దిరోజులగా కొరటాల శివ, బన్నీ, ఎన్టీఆర్ వీరి నెక్స్ట్ ప్రాజెక్ట్ లపైన చాలా కన్ప్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకూ బన్నీ పుష్ప తరువాత కొరటాల శివతో సినిమా చేస్తాడనుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని ఫిక్స్ అయిపోయారు. కానీ ఎన్టీఆర్ 30 సినిమా కొరటాలతో ఉంటుందని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఎన్టీఆర్ సినిమాపై ఉన్న కన్ప్యూజన్ పోయింది ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఈ సినిమాతో ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. ఇక ఇప్పుడు దీనిపై బన్నీ నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో యువసుధ సంస్థ ఓ ట్వీటు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉందని.. ఏప్రిల్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
మ్యూజికల్ హిట్ "గంగోత్రి " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఇంప్రెసివ్ యాక్టింగ్ , డ్యాన్సింగ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక.