సీటీమార్ లో డ్యాన్స్‌, స్టైల్ అదిరిపోయాయి బ్రదర్..!

Bollywood Actor Salmaan Khan Praises Icon Staar Allu Arjun For His Dance Movies In Seetimaar Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bollywood Superstar Salman Khan,Salman Khan,Actor Salman Khan,Icon Staar Allu Arjun,Allu Arjun,Salman Khan About The Icon Staar Allu Arjun,Salman Khan About Allu Arjun,DJ: Duvvada Jagannadham,Seeti Maar Song,Seeti Maar Full Video Song,Seeti Maar Radhe,Radhe - Your Most Wanted Bhai,Disha Patani,DSP,Seeti Maar,Seeti Maar Video Song,Seeti Maar Radhe Song,Seeti Maar Hindi Song,Seeti Maar,Radhe Sheeti Maar Song,Radhe Seeti Maar Video Song,Radhe Salman Khan Song,Salman Khan New Song,Seeti Maar Salman Khan Song,Seeti Maar Salman Khan,Radhe Movie Song,Seeti Maar Video Song Radhe Movie,Radhe Movie Seeti Maar Song,Salman Khan And Disha Patani Song,Allu Arjun Seeti Maar Song,Salman Khan Praises Icon Staar Allu Arjun,Allu Arjun Thanks Salman Khan,Salman Khan To Allu Arjun,Salman Khan Thanks Allu Arjun,#SeetiMaar,#Radhe​,#AlluArjun

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా రాధేశ్యామ్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక సీటీమార్ పాటతో ఈసినిమా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘DJ-దువ్వాడ జగన్నాథం’ చిత్రం కోసం దేవిశ్రీ కంపోజ్ చేసిన ‘సీటీమార్’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట బాగా నచ్చి సల్మాన్ రీమిక్స్ చేయమని కోరడంతో.. దేవిశ్రీ హిందీలో ఈ పాటను మళ్ళీ కంపోజ్ చేశారు. ఈపాట ఇప్పుడు యూట్యూబ్లో హల్ చల్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా స‌ల్మాన్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అల్లు అర్జున్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సాంగ్‌లో మీ ప‌ర్‌ఫార్మెన్స్ ఎంత‌గానో న‌చ్చింది. డ్యాన్స్‌, స్టైల్ అదిరిపోయాయి. మీరు, మీ కుటుంబ స‌భ్యులు క్షేమంగా ఉండండి.ల‌వ్ యూ బ్ర‌ద‌ర్ అని స‌ల్మాన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక స‌ల్మాన్ ట్వీట్‌కు స్పందించిన అల్లు అర్జున్.. మీ నుండి కాంప్లిమెంట్ అందుకున్నందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్యూ స‌ల్మాన్ గారు. రాధే స్క్రీన్స్‌పైన మ్యాజిక్ చేసి అభిమానుల‌కు మీకు సీటీమార్ వేయాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ‌కు ధ‌న్యవాదాలు అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కాగా ఈసినిమాలో దిశా పటాని, రణదీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌ తదితరులు నటించగా రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్స్, సోహైల్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్, సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. మే13న ఈ చిత్రాన్ని ఒకేసారి థియేట్రికల్ మరియు డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘పుష్ప‌’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా ఈ సినిమాలో విలన్‌ పాత్రలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fifteen =