
ట్యాగ్ · 17 కథనాలు


రజనీకాంత్ 169 మూవీ కి నాగార్జున మూవీ టైటిల్ ?

'రజనీ 169'మూవీలో ప్రత్యేకతలు..!

"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ పై రజనీకాంత్ ప్రశంసలు

రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫైనల్ షెడ్యూల్ లో 'అన్నాత్తే '

పోల్ గేమ్ : తలైవా బెస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ ?

దీపావళికే రజినీ 'అన్నాత్తే' ..!

"అన్నాత్తే "హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి

స్ట్రిక్ట్ రూల్స్ తో రజినీ 'అన్నాత్తే' షూట్

'అన్నాత్తే' అనుకున్న డేట్ కే సినిమా రిలీజ్

కమల్ భగవద్గీత- రజనీ దేవుడు

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పై రజనీకాంత్ స్పందన

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్ రజనీకాంత్

రజినీ పొలిటిల్ ఎంట్రీ పై మోహన్ బాబు రియాక్షన్
తలైవా రజనీకాంత్ బయోపిక్ మూవీ ?

"జైలర్ "మూవీ కై హైదరాబాద్ లో భారీ సెట్స్
తమిళ , తెలుగు , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “డాక్టర్”, “బీస్ట్”మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “జైలర్ ” తమిళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ కథానాయిక పాత్రలో నటించే అవకాశం ఉంది. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం…

రజనీకాంత్ 169 మూవీ కి నాగార్జున మూవీ టైటిల్ ?
తమిళ ప్రజల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ పలు తమిళ , తెలుగు , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు సేవ కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రజనీకాంత్ 169 వ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

'రజనీ 169'మూవీలో ప్రత్యేకతలు..!
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ప్రస్తుతం రజనీ కాంత్ తన తరువాత సినిమాకోసం రెడీ అవుతున్నారు. రజనీ తన నెక్ట్స్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ సినిమాతో రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు రజనీతో సినిమాకు సిద్దమవుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో ఇంకా పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ పై రజనీకాంత్ ప్రశంసలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో 4రోజులలోనే 500 కోట్ల క్లబ్ లో చేరింది.హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

స్పెషల్ డే కి 'అన్నాత్తే' ఫస్ట్ లుక్..!
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అన్నాత్తే”. ఈసినిమా షూటింగ్ కు కూడా ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. కరోనా వల్ల సగం లేట్ అయితే మధ్యలో రజినీ ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన ఈసినిమా షూటింగ్ పై ఎఫెక్ట్ పడింది. ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసేశారు.

రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు
"లై "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు."ఛల్ మోహన్ రంగ "మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ "పేట " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "శాటిలైట్ శంకర్ " మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. మేఘ ప్రస్తుతం 2 తమిళ , 4 తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. మేఘ కథానాయికగా రూపొందిన "డియర్ మేఘ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "డియర్ మేఘ "మూవీప్రమోషన్‌లో పాల్గొన్నమేఘ అభిమానుల ఆరాధ్య దైవం తలైవా రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫైనల్ షెడ్యూల్ లో 'అన్నాత్తే '
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అన్నాత్తే”. కోవిడ్ కారణంగా.. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయినా కూడా సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఎలాగైనా ముగించాలని అనుకున్న చిత్రబృందం.. అన్ని కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ.. హైద్రాబాద్ షెడ్యూల్ ను మాత్రం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది

పోల్ గేమ్ : తలైవా బెస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ ?
భాషా : సత్య మూవీస్ బ్యానర్ పై సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ , నగ్మా జంటగా రూపొందిన గ్యాంగ్ స్టర్ తమిళ మూవీ "భాషా "తెలుగు డబ్బింగ్ వెర్షన్ "భాషా "ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో అద్భుతంగాపెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ లోని భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే డైలాగ్ పాప్యులర్ అయ్యింది.

దీపావళికే రజినీ 'అన్నాత్తే' ..!
శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వస్తున్న సినిమా అన్నాత్తే. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. ఇక ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టగా మళ్లీ సెకండ్ వేవ్ వచ్చింది. అన్నాత్తే టీమ్ మెంబర్స్ కరోనా బారిన పడటం.. మధ్యలో రజినీ కూడా అనారోగ్యం పాలవ్వడం వల్ల మధ్యలో కొన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడింది. ఆతర్వాత మళ్లీ హైద్రాాబాద్ వచ్చి లాక్ డౌన్ పెట్టినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని హైద్రాబాద్ లో షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ఇదిలా ఉండగాఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తున్నాయి. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్టే. రజినీ దాదాపు తన పోర్షన్స్ ను పూర్తి చేసినట్టు…

"అన్నాత్తే "హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ”తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రజనీకాంత్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

స్ట్రిక్ట్ రూల్స్ తో రజినీ 'అన్నాత్తే' షూట్
మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'. 'అన్నయ్య'గా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఉన్నప్పటికీ అన్నాత్తే చిత్ర బృందం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మరీ చిత్రీకరణ జరుపుతున్నారు.

'అన్నాత్తే' అనుకున్న డేట్ కే సినిమా రిలీజ్
గత ఏడాది నుండి కొన్ని సినిమాల షూటింగ్ లకు మాత్రం అస్సలు టైమ్ కలిసిరావట్లేదు. కరోనా పోయింది ఇక షూటింగ్ లు మొదలు పెట్టొచ్చు అనుకున్నారు కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ తో మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పటికే ఎన్నో సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడగా.. ఇప్పుడు రజినీ అన్నాత్తే సినిమాకు కూడా బ్రేక్ పడింది. ఇటీవల రజనీ పూర్తిగా కోలుకోవడంతో తిరిగి షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించింది.

కమల్ భగవద్గీత- రజనీ దేవుడు
కమల్ భగవద్గీత.. రజనీ దేవుడు అంటున్నాడు మన రాఖీ భాయ్ అదే కన్నడ సూపర్ స్టార్ యష్. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న యష్ రజనీ కాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ గురించి చెప్పమని అడుగగా దానికి సమాధానంగా యష్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. కమల్ హాసన్ నటనలో భగవద్గీత లాంటివాడని పెద్ద బిరుదే ఇచ్చేశాడు. రజనీకాంత్ ఏకంగా దేవుడని.. 'తలైవా' అని చెప్పాడు. బాలీవుడ్ బాద్షానేమో ఇన్ స్పిరేషన్ అంటూనే 'జీనియస్' అని కూడా కితాబునిచ్చాడు. నవాజుద్దీన్ సిద్ధీఖీ గురించి మాట్లాడుతూ.. ఇమ్మెన్స్‌లీ టాలెంటెడ్ ఆయనతో కలసి సినిమా చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పై రజనీకాంత్ స్పందన
“అపూర్వ రాగంగళ్ “(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో నటిస్తూ , తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు అందుకున్నారు. ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు రజనీకాంత్ ఎంపిక అయ్యారు .హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్ రజనీకాంత్
"అపూర్వ రాగంగళ్ "(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ "అంతులేని కథ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కెరీర్ ప్రారంభం లో నెగటివ్ రోల్స్ లో నటించిన రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో హీరోగా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో 165 సినిమాలకు పైగా నటించారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు అందుకున్నారు. ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారానికి రజనీకాంత్ ఎంపిక అయ్యారు .

రజినీ పొలిటిల్ ఎంట్రీ పై మోహన్ బాబు రియాక్షన్
ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు . అయితే ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నానని.. డిసెంబర్ 31న తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తానని, జనవరిలో పార్టీని స్టార్ట్ చేస్తానని ఆయన తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మరో ట్విస్ట్ ఇచ్చారు రజినీ. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ ట్విట్టర్ వేదికగా ఒక లేఖను విడుదల చేశారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు…
తలైవా రజనీకాంత్ బయోపిక్ మూవీ ?
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా బయోపిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. లెజెండరీ ఫిల్మ్ స్టార్స్ నందమూరి తారక రామారావు , సావిత్రి బయోపిక్ మూవీస్ రూపొందాయి. లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ "తలైవి "మూవీ రూపొందుతుంది. ఇప్పుడు కోట్లాది ప్రజల అభిమాన కథానాయకుడు తలైవా రజనీకాంత్ పై బయోపిక్ మూవీ రూపొందనుందని సమాచారం.