కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhanush

ట్యాగ్ · 134 కథనాలు · పేజీ 2

Kubera Teaser gets a release date
ట్రైలర్ & టీజర్

కుబేర టీజర్ రానుంది

సార్ తరువాత ధనుష్ తెలుగులో నటిస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈనెలలో సినిమా కంప్లీట్ కానుంది.ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది.ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈనెల 15న ఈటీజర్ రానుంది.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
3 re release gets excellent response
సినిమా వార్తలు

3 రీ రిలీజ్ కు సూపర్ రెస్పాన్స్

తమిళ స్టార్ ధనుష్ నటించిన 3 సినిమా రేపు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కానుంది.ఇక దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుందిసెలెక్టెడ్ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండగా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతున్నాయి.ఇప్పటివరకు బుక్ మై షోలో పదివేలకు పైగా టికెట్స్ తెగాయి.ఓ తమిళ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే చిన్న విషయం కాదు.

Mahender Reddyవాట్సాప్
Dhanush Raayan Movie OTT Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Raayan On Prime From Aug 23,Raayan On Prime,Raayan From Aug 23,Raayan OTT,Raayan Movie OTT,R
ఓటీటీ

రాయన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలెంటెడ్ నటుడు ధనుష్ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు రాయన్ అంటూ వచ్చాడు. ఈసినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాకుండా తానే దర్శకత్వం కూడా వహించాడు. జూన్ 26వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ ను అందించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్‌ నటనకు, స్క్రిప్ట్‌కి, టేకింగ్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈసినిమా 100 కోట్లకు…

TFN Adminవాట్సాప్
dhanush raayan movie screenplay selected to academy awards library
సినిమా వార్తలు

ధనుష్ రాయన్ కు అరుదైన గౌరవం

ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 26వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ ను అందించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్‌ నటనకు, స్క్రిప్ట్‌కి, టేకింగ్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇప్పటికే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది.

TFN Adminవాట్సాప్
raayan 4days collections
బాక్సాఫీస్

రాయన్ 4డేస్ కలెక్షన్స్

మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన రాయన్ నాలుగో రోజు కూడా సూపర్ వసూళ్లను దక్కించుకుంది.వర్కింగ్ డే లోకూడా సాలిడ్ హోల్డ్ చూపించడంతో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 87.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తమిళనాడులో 43కోట్లు,తెలుగు రాష్ట్రాల్లో 8కోట్లు,ఓవర్సీస్ లో 25కోట్ల వసూళ్లను సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Superstar Mahesh Babu Praises Dhanush Acting and Direction For Raayan
సినిమా వార్తలు

రాయన్‍ పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు

కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'రాయన్'. ఇది ధనుష్ 50వ చిత్రం కావడం, అందునా ఆయనే దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జులై 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇక రాయన్ చిత్రాన్ని తమిళంలో సన్ పిక్చర్స్ నిర్మించగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి గ్రాండ్‌గా విడుదల చేసింది. సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
raayan three days collections
బాక్సాఫీస్

రాయన్ 3డేస్ కలెక్షన్స్

ధనుష్ రాయన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 75.42కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.తమిళనాడులో మొదటి రెండు రోజుల కన్నా నిన్న అత్యధిక వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.సార్ తరువాత ధనుష్ ఈసినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇందులో నటించడం మాత్రమే కాదు తనే డైరెక్షన్ కూడా చేశాడు.ఇది ధనుష్ కు 50వ సినిమా కూడా.

Mahender Reddyవాట్సాప్
Kubera Team Released Dhanush's Special Poster on His Birthday
ఫస్ట్ లుక్

ధనుష్ బర్త్ డే.. కుబేర నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ డిఫరెంట్ పోస్టర్లు , గ్లింప్స్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. కాగా ఆదివారం ధనుష్ పుట్టినరోజు. శేఖర్ కమ్ముల టీం ధనుష్ పుట్టినరోజును అద్భుతమైన పోస్టర్ తో సెలబ్రేట్ చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Dhanush’s 50th Film Raayan Telugu Review,Raayan,Raayan First Review,Raayan Movie,Raayan Movie First Review,Raayan Movie Review,Raayan Movie Review And Rating,Raayan Movie Review And Response,Raayan Review,Raayan Review And Rating,Raayan Review And Re
రివ్యూ

రాయన్ తెలుగు రివ్యూ

ఇక ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన రాయన్ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. ధనుష్ యాక్టింగ్ అండ్ టేకింగ్ బాగా హైలైట్ అయ్యాయి. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా వుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఐడెంటిటీ వుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ రివేంజ్ డ్రామా ఫార్మాట్‍లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. అలాగే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళను అలరించేలా కూడా ఉంది. సో.. మొత్తం 2 గంటల 25 నిమిషాలు నిడివి గల రాయన్ సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Srikanth Mవాట్సాప్
Raayan Heroines Aparna Balamurali and Dushara Vijayan Praises Hero Dhanush
సినిమా వార్తలు

ధనుష్ గారికి మేం పెద్ద ఫ్యాన్స్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మైల్ స్టోన్ మూవీ (50వ చిత్రం) 'రాయన్'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Raayan Pre Release Event Sundeep Kishan Praises Hero Dhanush
సినిమా వార్తలు

ధనుష్ అన్న నాకు గురువు లాంటి వారు - సందీప్ కిషన్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మైల్ స్టోన్ మూవీ (50వ చిత్రం) 'రాయన్'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
i like to do a multistarrer with jr ntr says dhanush
సినిమా వార్తలు

పవన్ అంటే ఇష్టం.. కానీ తారక్ తో చేస్తా- ధనుష్

టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తున్న స్వీయ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా జులై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాలో ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
dhanush raayan movie ticket bookings open
సినిమా వార్తలు

రాయన్ బుకింగ్స్ ఓపెన్

ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా రాయన్. తన కెరీర్లో 50వ సినిమాగా వస్తున్న ఈసినిమాకు ధనుషే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాలో ధనుష్ ఒక మెకానిక్ గా నటిస్తున్నాడు. ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ తో పాటు పలు పాటలను కూడా రిలీజ్ చేశారు. అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్ననే ఘనంగా నిర్వహించారు. ఇక ఈవెంట్ కి ధనుష్ సహా చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు వంటి నిర్మాతలు అతిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా బుకింగ్స్…

TFN Adminవాట్సాప్
dhanush raayan movie trailer out now
ట్రైలర్ & టీజర్

రాయన్ ట్రైలర్ రిలీజ్

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఈసినిమా రాయన్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. నార్త్ మద్రాస్‌ బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా వస్తోంది. ఈసినిమా ధనుష్ 50వ సినిమా కావడంతో సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది. ఈసినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

TFN Adminవాట్సాప్
dhanush raayan movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

ధనుష్ రాయన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా ధనుష్. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై ఆసక్తి పెరగడానికి కారణం ధనుషే స్వయంగా ఈసినిమాకు దర్శకత్వం చేయడమే కారణం. ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ జులై 26న విడుదల కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోష్స్ లో జోరు పెంచారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Tripti Dimri to pair up with Dhanush in Tere Ishk Mein
సినిమా వార్తలు

ధనుష్ కి జోడీ గా యానిమల్ హీరోయిన్

యానిమల్ తో ఫేమ్ తెచ్చుకుంది తృప్తి డిమ్రి.ఇందులో ఆమె గ్లామర్ కి యూత్ ఫిదా అయ్యింది దాంతో నేషన్ వైడ్ గా పాపులర్ అయ్యింది.ఇక ఇప్పుడు మరో ఆఫర్ కొట్టేసింది తృప్తి.సౌత్ హీరో ధనుష్ సరసన తృప్తి డిమ్రి నటించనుందని సమాచారం.ధనుష్ హిందీలో తేరే ఇష్క్ మే అనే సినిమా చేస్తున్నాడు.ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఈసినిమాను డైరక్ట్ చేస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమాకోసం తృప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకున్నారట.అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది.

TFN Adminవాట్సాప్
raayan movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

రాయన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు ధనుషే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు అన్నీ ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
dhanush and nagarjuna movie title and first look released
ఫస్ట్ లుక్

ధనుష్-నాగార్జున మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

మల్టీ స్టారర్ సినిమాలు కామన్ అయిపోయాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషనే మరొకటి తెరపైకి వస్తుంది. ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Dhanush's Captain Miller Streaming in OTT Now
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కెప్టెన్ మిల్లర్.. ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధానపాత్రలో వచ్చిన రీసెంట్ మూవీ 'కెప్టెన్ మిల్లర్'. పీరియాడికల్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ఈ మూవీకి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. గత నెలలో పొంగల్ సందర్భంగా విడుదలైన ఈ మూవీ తమిళనాట మంచి సక్సెస్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
dhanush captain miller movie trailer update
ట్రైలర్ & టీజర్

త్వరలో రానున్న కెప్టెన్ మిల్లర్ ట్రైలర్

రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈసినిమా పొంగల్ రేసులో రానున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ గురించి. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ అప్ డేట్ ఇచ్చాడు ధనుష్. ఈసినిమా ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు.

TFN Adminవాట్సాప్

షేర్