రాయన్ తెలుగు రివ్యూ

Dhanush’s 50th Film Raayan Telugu Review,Raayan,Raayan First Review,Raayan Movie,Raayan Movie First Review,Raayan Movie Review,Raayan Movie Review And Rating,Raayan Movie Review And Response,Raayan Review,Raayan Review And Rating,Raayan Review And Response,Raayan Telugu Movie,Raayan Telugu Movie 2024,Raayan Telugu Movie Review,Raayan Telugu Movie Review 2024,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Dhanush,Dhanush Raayan Movie,Dhanush Raayan Movie Review,Dhanush Movies,Dhanush Telugu Movies,Telugu Film News 2024,Telugu Filmnagar,Tollywood Movie Updates,Raayan Movie Telugu Review,Sundeep Kishan,Raayan Telugu Review

నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జే.సూర్య, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, దుషారా విజయన్‌
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఓం ప్రకాశ్‌
ఎడిటింగ్: ప్రసన్న జికె
దర్శకత్వం: ధనుష్
నిర్మాణం: సన్‌ పిక్చర్స్‌

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘రాయన్’. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. రాయన్ చిత్రాన్ని తమిళంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ నిర్మించగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి గ్రాండ్‌గా విడుదలచేసింది.

అయితే ఇది ధనుష్ 50వ చిత్రం కావడం, అందునా ఆయనే దర్శకత్వం వహించడం కారణంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? లేదా? అనేది తెలుసుకుందాం.

కథ:

కార్తవ రాయన్‍ (ధనుష్) కు ఇద్దరు తమ్ముళ్లు ఉంటారు. అందులో ఒకరు ముత్తు వేల్ (సందీప్ కిషన్), మరొకరు మాణిక్యం (కాళిదాస్ జయరామ్). వీరికి ఒక ఒక చెల్లి దుర్గ (దుషారా విజయన్) ఉంటుంది. చిన్నప్పుడే గ్రామం నుండి టౌన్‍కి వచ్చేస్తారు. పెద్దయ్యాక చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, తమ్ముళ్లను బాగా సెటిల్ చేయాలని తపన పడుతుంటాడు. రాయన్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు.

అయితే రాయన్‍ తమ్ముడు ముత్తు అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఒకసారి ముత్తు వేల్, డాన్ దురై (శరవణన్) మనుషులతో ఘర్షణ పడతాడు. అంతటితో ఆగకుండా దొరై కొడుకుని చంపేస్తాడు. దీంతో రాయన్ కుటుంబం అందరినీ చంపేస్తానని దురై వార్నింగ్ ఇస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాయన్ తమ్ముళ్ళతో కలిసి వెళ్లి దురైను చంపేస్తాడు. ఇది తెలుసుకున్న దురై ప్రత్యర్థి సేతు రామన్ (ఎస్.జె. సూర్య) రాయన్‍ని తనతో కలిసి పని చేయమని కోరతాడు. అయితే అందుకు రాయన్ ఒప్పుకోడు.

ఇక దొరై చనిపోయిన వార్త తెలిసిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ప్రకాష్ రాజ్) ఈ విషయంపై ఎంక్వయిరీ చేస్తాడు. దీని తర్వాత రాయన్ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? అసలు తొలుత దురైను రాయన్ ఎందుకు చంపాడు? వీరిని సేతు రామన్ ఏం చేశాడు? రాయన్, అతని తమ్ముళ్ల మధ్య విబేధాలు ఎందుకు వచ్చాయి? చివరకు ఏమైంది? వీరి జీవితాలను అల్లకల్లోలం చేసిన గొడవలను అసిస్టెంట్ కమిషనర్ ఏ విధమైన మలుపులు తిప్పాడు? అనేది మిగతా సినిమా కథ.

విశ్లేషణ:

రాయన్ (ధనుష్) పాత్రకు సంబంధించి చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్‌తో సినిమా ప్రారంభమవుతుంది. అనంతరం రాయన్‍ ఫ్యామిలీ లోని మిగిలిన పాత్రలను పరిచయం చేస్తాడు డైరెక్టర్. సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి మధ్య రొమాంటిక్ సీన్స్ అలరిస్తాయి. కథలో షాకింగ్ ట్విస్ట్ తర్వాత, ఇంటర్వెల్ పడుతుంది. ఇక రాయన్‍, సేతు రామన్ మధ్య ముఖాముఖి సన్నివేశాలతో సెకండాఫ్ ఇంట్రెస్టింగ్‍గా సాగుతుంది. త‌న సోద‌రిని కాపాడేందుకు ధ‌నుష్ వేసే ఎత్తుగడలు ఆసక్తికరంగా ఉంటాయి.

కథగా చూస్తే రాయన్ ఒక సాధారణ రివేంజ్ డ్రామా. కానీ, ధనుష్ తన టేకింగ్‌తో సినిమాకు న్యూ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. కంప్లీట్ రా అండ్ రస్టిక్‌గా రూపొందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ పోర్షన్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు. దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పా పాండి’ తోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న ఆయన ఇప్పుడు రెండో సినిమాతో మరోసారి సత్తా చాటారు. ధనుష్‌ 50వ సినిమాకు రాయన్‌ సరైన ఎంపిక.

ఇక నటీనటుల విషయానికొస్తే.. ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కోసం ఆయన ట్రాన్సర్మేషన్ అయిన తీరు, స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. కొన్ని సన్నివేశాల్లో అయితే ఆయన యాక్టింగ్ పీక్స్‌లో ఉంది. ఇక సందీప్ కిషన్‍కి మంచి రోల్ దక్కింది. అలాగే ఎస్‌జే సూర్య మరోసారి తన నటనతో మైమరిపించాడు. ప్రకాష్ రాజ్ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించాడు. కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, దుషారా విజయన్ నటన డీసెంట్‌గా ఉంది.

టెక్నికల్ పరంగా రాయన్ చాలా బావుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆయన ఇచ్చిన బీజీఎమ్ సినిమాకు బ్యాక్‌బోన్‍గా నిలిచింది. ఈ మూవీకి రెహమాన్ సెకండ్ హీరో అని కొందరు అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ సహా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.

ఇక ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన రాయన్ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. ధనుష్ యాక్టింగ్ అండ్ టేకింగ్ బాగా హైలైట్ అయ్యాయి. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా వుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఐడెంటిటీ వుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ రివేంజ్ డ్రామా ఫార్మాట్‍లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. అలాగే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళను అలరించేలా కూడా ఉంది. సో.. మొత్తం 2 గంటల 25 నిమిషాలు నిడివి గల రాయన్ సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.