ధనుష్ రాయన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

dhanush raayan movie trailer release date fixed

తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా ధనుష్. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై ఆసక్తి పెరగడానికి కారణం ధనుషే స్వయంగా ఈసినిమాకు దర్శకత్వం చేయడమే కారణం. ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ జులై 26న విడుదల కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోష్స్ లో జోరు పెంచారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. రేపు అంటే జులై 16వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్.

కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ డీవోపీగా అలానే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్‌ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.