తమిళ స్టార్ ధనుష్ నటించిన 3 సినిమా రేపు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కానుంది.ఇక దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుందిసెలెక్టెడ్ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండగా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతున్నాయి.ఇప్పటివరకు బుక్ మై షోలో పదివేలకు పైగా టికెట్స్ తెగాయి.ఓ తమిళ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే చిన్న విషయం కాదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2012లో ఈసినిమా విడుదలకాగా ఇందులో ధనుష్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించింది.సూపర్ స్టార్ రజినీకాంత్ కూతరు ఐశ్వర్య రజనీకాంత్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.నట్టికుమార్ ఈసినిమాను తెలుగులో విడుదలచేశారు.ఇందులోని కొలవరి సాంగ్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.
ఇక ధనుష్ ప్రస్తుతం తెలుగులో కుబేర చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.షూటింగ్ కూడా చివరి చేరుకుంది.వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలచేసే యోచనలో వున్నారు.
ఇక రీసెంట్ గా ధనుష్,రాయన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.ఈసినిమా 150కోట్ల వసూళ్లను సాధించింది.ఇందులో ధనుష్ నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేశాడు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: