ధనుష్ రాయన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 75.42కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.తమిళనాడులో మొదటి రెండు రోజుల కన్నా నిన్న అత్యధిక వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.సార్ తరువాత ధనుష్ ఈసినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇందులో నటించడం మాత్రమే కాదు తనే డైరెక్షన్ కూడా చేశాడు.ఇది ధనుష్ కు 50వ సినిమా కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రాయన్ తెలుగులో కూడా రిలీజ్ అవ్వగా హిట్ దిశగా పయనిస్తోంది.మూడు రోజుల్లో దాదాపు 7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.మరో 2కోట్ల షేర్ రాబట్టుకుంటే చాలు బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.వచ్చే వారం వరకు పెద్ద సినిమాల విడుదల లేకపోవడం కూడా అడ్వాంటేజ్ కానుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో యంగ్ హీరో సందీప్ కిషన్,కాళీ జయరామ్,అపర్ణ బాలమురళి,దుషరా విజయన్,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























