
ట్యాగ్ · 14 కథనాలు


విశ్వంభర లో చిరు డెడికేషన్

మెగా 157 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం

ఫ్యామిలీ మ్యాన్ మిస్ చేసుకున్న చిరంజీవి ?

భోళాశంకర్- చిరు కోసం నెవర్ బిఫోర్ కటౌట్

భోళాశంకర్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న సుశాంత్

భోళాశంకర్ డబ్బింగ్ పూర్తిచేసుకున్న చిరు

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సౌత్ కొరియా అంబాసిడర్ తో మెగాస్టార్ విందు

నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టిన చిరు
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవికి మిక్సడ్ రిజల్ట్ ఇచ్చింది.సంక్రాంతికి చిరు, వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.ఈసినిమా 200కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.అయితే ఈసినిమా తరువాత చేసిన భోళా శంకర్ నిరాశ పరిచింది.ఇక ప్రస్తుతం చిరు,విశ్వంభర లో నటిస్తున్నాడు.బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నాడు.సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఇందులో చిరుకి జోడిగా త్రిష కనిపించనుండగా యువ హీరోయిన్లు ఆషికా రంగనాథ్ ,సురభి ,ఇషా చావ్లా ,మీనాక్షి చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు.సంక్రాంతికి విడుదలకానుంది.

విశ్వంభర లో చిరు డెడికేషన్
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే. కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా.

మెగా 157 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో ఒక కొత్త చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చిత్ర దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో.. " ‘మెగా 157’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సరికొత్త అనుభూతినిచ్చే సినిమాటిక్ అడ్వెంచర్‌కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధం" అని వశిష్ట పేర్కొన్నారు. ఈ సందర్భంగా వశిష్ట ‘మెగా 157’ టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్ చే శారు. కాగా ఈ సినిమా సోషియో ఫాంటసీగా రూపొందనుంది.

తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అన్నయ్య చిరంజీవి బర్త్ డే విషెస్
టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. నేటితో ఆయన 51 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52వ పడిలోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఆయనకు అభిమానులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా పవన్‌తో కలిసి తాము దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా తన తమ్ముడు జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ మిస్ చేసుకున్న చిరంజీవి ?
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.2019 సెప్టెంబర్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సెన్సేషన్ సృష్టించింది.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కొన్ని నెలలపాటు ట్రెండింగ్ లో కొనసాగింది.మొదటి సీజన్ బ్లాక్ బాస్టర్ కావడంతో రెండో సీజన్ కూడా వచ్చింది.ఈసీజన్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది.ఈసిరీస్ ను రాజ్ &డీకే డైరెక్ట్ చేయగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ లీడ్ రోల్ లో నటించాడు.

మెగాస్టార్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. త్వరలో శంకర్ దాదా MBBS రీ రిలీజ్
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోల పుట్టిన రోజు సందర్భంగా ఒకప్పటి హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'పోకిరి' నుంచి మొదలైన ఈ ట్రెండ్.. ఆ తర్వాత ఇండస్ట్రీలోని ఇతర టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్‌లతో ఊపందుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజై భారీ కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే విచిత్రంగా గతంలో అంతగా విజయం సాధించని సినిమాలు కూడా రీ రిలీజ్‌లో నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'యోగి' సినిమాను రీసెంట్‌గా రీ రిలీజ్ చేయగా.. విడుదలైనప్పటికంటే ఇప్పుడే ఎక్కువ…

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నేడు కీలక ప్రకటన చేసింది. చిరంజీవితో కొత్త సినిమాను చేయనున్నట్లు ప్రకటించింది. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో వారికి మెగా బర్త్ డే గిఫ్టును అందించినట్లయింది.

అన్నయ్య చిరంజీవికి 'బర్త్ డే' విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలోని అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. 1978లో 'పునాదిరాళ్లు' అనే తెలుగు సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన నేటికీ అగ్ర హీరోగా కొనసాగుతుండటం గమనార్హం. కాగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. నేటితో ఆయన 68వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి.. జనసేన పార్టీ అధినేత, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 'బర్త్ డే' విషెస్ తెలియజేశారు. ఈ మేరకు అన్నయ్య చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ ఒక లేఖను విడుదల…

భోళాశంకర్- చిరు కోసం నెవర్ బిఫోర్ కటౌట్
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు చేరుకుంటున్నాయి.

భోళాశంకర్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న సుశాంత్
గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

'భోళా శంకర్'లో పవర్ స్టార్ మేనరిజాన్ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు 'చిరు లీక్స్' పేరుతో తన సినిమాలకు సంబంధించిన కొన్ని సరదా విషయాలను అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా తన రాబోయే చిత్రం 'భోళా శంకర్' గురించి ఒక క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని లీక్ చేశారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని అనుకరించడం విశేషం. అందులో చిరంజీవి 'తమ్ముడి పాట వస్తుందిలే' అంటూ పవన్ 'ఖుషి' సినిమాలోని ఇంట్రొడక్షన్ సాంగ్ 'యే మేరా జహా' పాటను, అందులో పవన్ మేనరిజాన్ని అనుకరించారు.

భోళాశంకర్ డబ్బింగ్ పూర్తిచేసుకున్న చిరు
అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన జోష్ ఏమాత్రం తగ్గించడం లేదు. యంగ్ హీరోలే ఏడాదికి ఒకటి రిలీజ్ చేస్తుంటే చిరు మాత్రం రెండేసి సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ అంటూ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ఈ ఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఎలాంటి బ్రేకులు లేకుండా ఇన్ని రోజులు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వెళ్లింది.

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్న చిరు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం మూవీలోని సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో హీరోహీరోయిన్ల పై ఒక సాంగ్ ని చిత్రీకరించగా, హైదరాబాద్ లో ఒక పార్టీ సాంగ్ ని షూట్ చేశారు. మరోవైపు ఈసినిమా ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది.

సౌత్ కొరియా అంబాసిడర్ తో మెగాస్టార్ విందు
మెగాస్టార్ చిరంజీవి తాజాగా దక్షిణ కొరియా అంబాసిడర్ తో భేటీ అయ్యారు. తన ఇంటిలో ఆయనకు విందు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో ఆయనతో దిగిన ఫొటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలోని దక్షిణ కొరియా అంబాసిడర్ చాంగ్ జీబాక్ కు హై టీ సెషన్‌ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. శ్రీనగర్‌లో ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్‌లో రామ్‌చరణ్‌తో కలిసి `నాటు నాటు` పాటకి డాన్సులు వేసినప్పట్నుంచి మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. దక్షిణ కొరియా, ఇండియా సంస్కృతులు ఒకేలా ఉంటాయని, సినిమా, వినోద రంగానికి సంబంధించిన కల్చర్ కూడా దగ్గరగా ఉంటుందని..కె-పాప్, కె-డ్రామాలు ఇప్పటికే ఇండియన్…