భోళాశంకర్- చిరు కోసం నెవర్ బిఫోర్ కటౌట్

highest cutout in tollywood for chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు చేరుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ సందడి అప్పుడే మొదలైపోయింది. సినిమాా రిలీజ్ లకు ముందు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలకు భారీ భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం అనేది కామన్. అయితే కటౌట్ల విషయంలో కూడా పోటీ ఉంటుంది. ఏ హీరోకి ఎంత పెద్ద కటౌట్ పెడితే అంత గొప్ప అన్నమాట. ఇక ఇప్పుడు చిరు కోసం కూడా కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ చరిత్రలోనే ఇంతవరకూ పెట్టనంత హైట్ లో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. సూర్యపేటలోని రాజుగారి తోట రెస్టారెంట్ దగ్గర 126అడుగుల ఎత్తులో ఉన్న చిరు భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఇక అంత హైట్లో ఏర్పాటు చేసిన మొదటి కటౌట్ గా రికార్డు క్రియేట్ చేసింది చిరు కటౌట్.

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=””

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.