భోళాశంకర్ డబ్బింగ్ పూర్తిచేసుకున్న చిరు

chiranjeevi completes his dubbing for bholaa shankar movie

అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన జోష్ ఏమాత్రం తగ్గించడం లేదు. యంగ్ హీరోలే ఏడాదికి ఒకటి రిలీజ్ చేస్తుంటే చిరు మాత్రం రెండేసి సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ అంటూ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ఈ ఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఎలాంటి బ్రేకులు లేకుండా ఇన్ని రోజులు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వెళ్లింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ రీసెంట్ గానే పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మాత్రం ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరవైపు డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇక అలా షూటింగ్ అయిందో లేదో ఇలా డబ్బింగ్ కూడా పూర్తి చేసేశాడు చిరు. తాజాగా చిరు కూడా పూర్తి చేసినట్టు చిత్రయూనిట్ ఫొటోలు షేర్ చేస్తూ మరీ తెలిపింది.

కాగా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు సుశాంత్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.