
ట్యాగ్ · 34 కథనాలు · పేజీ 2


కెరీర్ లో గేమ్ ఛేంజర్ మూవీ "బాహుబలి"- ప్రభాస్

ప్రభాస్ కు అనుష్క బర్త్ డే విషెస్

"లూసిఫర్ "తెలుగు రీమేక్ లో అనుష్క ?

అనుష్క క్యూట్ స్మైల్

"దుర్గామతి "టీమ్ కు అనుష్క విషెస్

5ఏళ్ల బాహుబలి.. ఎన్నో రికార్డులు ..!
ఫ్లాప్ డైరెక్టర్ కి అనుష్క ఛాన్స్..!

15 ఇయర్స్ ఆఫ్ అనుష్క ఈవెంట్ డేట్
'నిశ్శబ్దం' ట్రైలర్ రిలీజ్

"నిశ్శబ్ధం"మూవీ షూటింగ్ టైమ్ లో మిస్సింగ్

ఏప్రిల్ 2... భళ్ళాలదేవ వర్సెస్ దేవసేన

"ఆర్ ఆర్ ఆర్ "సక్సెస్ పార్టీ లో స్టార్ హీరోయిన్ అనుష్క
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

కెరీర్ లో గేమ్ ఛేంజర్ మూవీ "బాహుబలి"- ప్రభాస్
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా రూపొందిన “బాహుబలి ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటిచెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.

ప్రభాస్ కు అనుష్క బర్త్ డే విషెస్
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ పోస్ట్ లతో సందడి చేస్తున్నారు. దీనితో పాటు ప్రభాస్ సినిమాల నుండి కూడా అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసందర్భంగా ప్రభాస్ కు దేశవ్యాప్తంగా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. దీనిలో భాగంగానే అనుష్క కూడా ప్రభాస్ కు స్పెషల్ విషెస్ అందించింది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. లైఫ్ లో వచ్చే ప్రతి అంశంలో బెస్ట్ గా ఉండాలని అలాగే నీ స్టోరీస్ అన్నీ విజయవంతం అయ్యి అందరి హృదయాలను…

"లూసిఫర్ "తెలుగు రీమేక్ లో అనుష్క ?
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన "సైరా నరసింహా రెడ్డి "మూవీ లో అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుష్క ఇప్పుడు చిరంజీవి హీరోగా రూపొందనున్న రీమేక్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం.

అనుష్క క్యూట్ స్మైల్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అనుష్క తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క బ్లాక్ బస్టర్ మూవీస్ "అరుంధతి "లో అరుంధతి , "వేదం "లో సరోజ , "బాహుబలి" లో దేవసేన , "రుద్రమదేవి "లో రుద్రమదేవి క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా అనుష్క పలు అవార్డ్స్ అందుకున్నారు.

"దుర్గామతి "టీమ్ కు అనుష్క విషెస్
యు వి క్రియేషన్స్ బ్యానర్ పై జి. అశోక్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ "భాగమతి " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో భాగమతి గా అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. US బాక్స్ ఆఫీస్ లో "భాగమతి " మూవీ వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. "భాగమతి " మూవీ హిందీ భాషలో "దుర్గామతి"మూవీ గా రీమేక్ జరుపుకుంది.

5ఏళ్ల బాహుబలి.. ఎన్నో రికార్డులు ..!
తెలుగు సినీ చరిత్రలో బాహుబలి సిరీస్ ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించిందని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చెక్కిన శిల్పమే ఈ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్ వంటి ప్రధాన పాత్రలతో రాజమౌళి తెరకెక్కించిన ’బాహుబలి’ భారతీయ సినీ చరిత్రలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలై నేటితో 5 ఐదేళ్లు పూర్తి చేసుకుంది. భారీ సెట్టింగులు, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, ఆకట్టుకునే కథ, కథనాలు, రాజమౌళి మార్క్ టేకింగ్, సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలు.
ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘బాహుబలి 2: ది కంక్లూజన్’కి 3 ఏళ్ళు
భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీస్‌కి ఊపు తెచ్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఆ సిరీస్‌లో రెండో చిత్రంగా వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడమే కాకుండా.. ఇండియన్ హిస్టరీలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ‘ఛత్రపతి’ ‘బాహుబలి: ది బిగినింగ్’ వంటి ఘనవిజయాల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వారిద్దరికీ హ్యాట్రిక్ మూవీగా నిలవడమే కాకుండా ఇండియన్ హిస్టరీలోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఫ్లాప్ డైరెక్టర్ కి అనుష్క ఛాన్స్..!
ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్స్ కే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు లేక వెనకపడ్డారు. దానికి కారణం వరుస ఫ్లాప్స్ వెంటాడమే కారణం. పూరీ కాస్త ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు. అలాంటిది ఇప్పుడొక డైరెక్టర్ ఒక్క సినిమాతో.. అది కూడా ప్లాప్ సినిమా తీసి ఇప్పుడు ఏకంగా అనుష్క తో చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు... సందీప్ కిషన్, రెజినా కాసాండ్రా జంటగా 2014లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రా రా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక దాదాపు ఆరేళ్ళ తరువాత ఆయన అనుష్క శెట్టిని కలిసి తన స్టోరీ లైన్ తో…

15 ఇయర్స్ ఆఫ్ అనుష్క ఈవెంట్ డేట్
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్ర లో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. "నిశ్శబ్ధం" మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.
'నిశ్శబ్దం' ట్రైలర్ రిలీజ్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం 'నిశ్శబ్దం'. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇక దీనికితోడు మొదటినుండి ఈ సినిమాకు మంచి బజ్ ఏ ఉంది. పోస్టర్లు, టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక వచ్చే నెల 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. న్యాచురల్ స్టార్ నాని తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తమిళ్ లో జయం రవి, హిందీలో మజోజ్ భాజ్ పాయ్ రిలీజ్ చేశారు. ఇక…

'నిశ్శబ్దం' టైటిల్ సాంగ్ రికార్డ్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

"నిశ్శబ్ధం"మూవీ షూటింగ్ టైమ్ లో మిస్సింగ్
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "నిశ్శబ్ధం" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ఈ హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. "నిశ్శబ్ధం"మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.

ఏప్రిల్ 2... భళ్ళాలదేవ వర్సెస్ దేవసేన
2020 ఏప్రిల్ 02.. ఆసక్తికరమైన పోరుకి వేదిక కానుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలచిన `బాహుబలి - ది కంక్లూజన్`లో ముఖ్య భూమికలు పోషించిన రానా (భళ్ళాలదేవ), అనుష్క (దేవసేన)... ఆ రోజు తమ కొత్త చిత్రాలతో బరిలో దిగుతున్నారు.