2020 ఏప్రిల్ 02.. ఆసక్తికరమైన పోరుకి వేదిక కానుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలచిన `బాహుబలి – ది కంక్లూజన్`లో ముఖ్య భూమికలు పోషించిన రానా (భళ్ళాలదేవ), అనుష్క (దేవసేన)… ఆ రోజు తమ కొత్త చిత్రాలతో బరిలో దిగుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మల్టీలింగ్వల్ మూవీగా రూపొందిన `నిశ్శబ్దం`తో ఏప్రిల్ 2న అనుష్క ఐదు భాషల్లో సందడి చేయనుండగా… త్రిభాషా చిత్రంగా తెరకెక్కిన `అరణ్య`తో రానా మూడు భాషల్లో పలకరించనున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రూపొందిన ఆ యా సినిమాలతో ఒకే రోజున బరిలోకి దిగుతున్న స్వీటీ, రానా ఏ స్థాయి విజయాలను అందుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.
అన్నట్టు.. `రుద్రమదేవి`, `బాహుబలి – ది బిగినింగ్` తరువాత రానా, అనుష్క కలసి నటించిన మూడో చిత్రమైన `బాహుబలి – ది కంక్లూజన్` కూడా ఏప్రిల్ నెలలోనే మూడేళ్ళ క్రితం విడుదలైంది. మరి.. అచ్చొచ్చిన మాసంలో మరోసారి పలకరించబోతున్న రానా, స్వీటీ.. ఈ సారి కూడా అదే స్థాయి సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.
[custom_ad]




అంతేకాదు.. ఒకే సినిమాలో ఢీ కొనే పాత్రలతో మెప్పించిన ఈ ఇరువురు.. వేర్వేరు సినిమాలతో ఢీ కొంటున్న తరుణంలోనూ విజయాలను ఒడిసిపట్టుకోవాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























