
ట్యాగ్ · 14 కథనాలు


ఏడాది పూర్తిచేసుకున్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్'

"బేబి"మూవీ కాస్టింగ్ కాల్

పుష్పక విమానం పబ్లిక్ టాక్

విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరో

"పుష్పక విమానం " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్

'ఆనంద్ దేవరకొండ' బేబి గ్రాండ్ లాంచ్

షూటింగ్ పూర్తి చేసుకున్న ఆనంద్ దేవరకొండ 'హైవే'

'పుష్పక విమానం' రిలీజ్ డేట్ ఫిక్స్

కె.వి గుహన్ తో ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ ప్రారంభం

ఆనంద్ దేవరకొండ "హైవే "మూవీ ప్రారంభం

బేబీ మూవీ టీజర్ పై విజయ్ దేవరకొండ , రష్మిక ప్రశంసలు
ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి నిర్మాతలుగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బేబీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో విడుదల కానున్న బేబీ మూవీ టీజర్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్ డేట్ ను అందించారు. ఈనెల 21 (సోమవారం)సాయంత్రం బేబీ చిత్ర టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండడం విశేషం.

మరో సినిమా ప్రకటించిన ఆనంద్ దేవరకొండ.. టైటిల్ రిలీజ్
దొరసాని సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ కొట్టాడు. అంతేకాదు కథల విషయంలో కూడా ఆనంద్ దేవరకొండ మొదటి నుండి కాస్త వైవిధ్యతను చూపిస్తున్నాడు. ఇటీవలే పుష్పక విమానం సినిమాతో అలరించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అందులోప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో హైవే అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా సాయి రాజేష్…

"హైవే " మూవీ కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ విభిన్న కథాంశాల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మాతగా సూపర్ హిట్ "118 "మూవీ ఫేమ్ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, మానస రాధా కృష్ణన్ జంటగా "హైవే మూవీ తెరకెక్కింది. సరి కొత్త లుక్ లో ఆనంద్ కనిపించనున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటించారు.

ఏడాది పూర్తిచేసుకున్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్'
ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. వెనిగళ్ల ఆనంద ప్రసాద్ ఈసినిమాను నిర్మించగా స్వీకర్ అగస్తి సంగీతం అందించాడు. అయితే ఈసినిమా రిలీజ్ అప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం.. థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలోనే ఈసినిమా రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ లో ఈసినిమా రిలీజ్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో. ఎన్ని కాంప్రమైజ్ లు ఉంటాయో.. ఆలోచనలు.. ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈసినిమాలో చూపించారు.

"బేబి"మూవీ కాస్టింగ్ కాల్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ వరస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తదుపరి సినిమాల కోసం ఆనంద్ ఎంతో తపనగా హార్డ్ వర్క్ చేస్తూ తన సోదరుడి సలహాలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా "పుష్పక విమానం" మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఆనంద్ మరో మూవీ తో అలరించనున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్ , వైష్ణవిచైతన్య ప్రధాన పాత్రలలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న "బేబి"మూవీ దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

పుష్పక విమానం పబ్లిక్ టాక్
Mast undi anna movie Music and anand anna script selection 👌 Konni scenes lo vijay gurtukochadu 😅 Saini sanvi superb performance asalu Best Family Comedy…

విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరో
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ లో నటిస్తున్నారు. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.

"పుష్పక విమానం " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
సెన్సేషనల్ చిత్ర హీరో విజయ్ దేవరకొండ సమర్పణ లో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్స్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , శాన్వీ మేఘన , గీత సైనీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పుష్పక విమానం” మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "పుష్పక విమానం". ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నవంబర్ 12న ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో నేడు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈసందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

'ఆనంద్ దేవరకొండ' బేబి గ్రాండ్ లాంచ్
కెరీర్ ప్రారంభంలో పలు సైడ్ క్యారెక్టర్లు చేసి ఆతరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా గుర్తింపుతెచ్చుకొని.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం విజయ్ రేంజ్ ఏంటో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అన్న అండతో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దొరసాని సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ కొట్టాడు. అంతేకాదు కథల విషయంలో కూడా ఆనంద్ దేవరకొండ మొదటి నుండి కాస్త వైవిధ్యతను చూపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ…

షూటింగ్ పూర్తి చేసుకున్న ఆనంద్ దేవరకొండ 'హైవే'
దొరసాని తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు ఆనంద్ దేవరకొండ. ఇక రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ తో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’. ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది.

'పుష్పక విమానం' రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. ‘దొరసాని’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు. రెండు సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కె.వి.గుహన్ దర్శకత్వం లో సైకో క్రై మ్ థ్రిల్లర్ నేపథ్యంలో హైవే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్‌పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

కె.వి గుహన్ తో ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ ప్రారంభం
విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా దొరసాని తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మిడిల్‌క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక మొదటి నుండి కాస్త డిఫరెంట్ సినిమాలు ఎంపిక చేసుకునే ఆనంద్ దేవరకొండ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ‘హైవే’ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి ప్రారంభమైంది.

ఆనంద్ దేవరకొండ "హైవే "మూవీ ప్రారంభం
సక్సెస్ ఫుల్ "దొరసాని "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ"మిడిల్ క్లాస్ మెలోడీస్ "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. ఆనంద్ ఇప్పుడు హైవే బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.