
ట్యాగ్ · 16 కథనాలు


గోవాలో అఖిల్ 'ఏజెంట్'
భారీ బడ్జెట్ తో అఖిల్ అక్కినేని 5వ సినిమా
అఖిల్ అక్కినేని వీకెండ్ హార్స్ రైడింగ్
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రీ టీజర్ రిలీజ్
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రిలీజ్ డేట్
అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ కన్ఫామ్
అఖిల్ అక్కినేని న్యూ లుక్
మెగా డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఖరారు..?
స్టైలిష్ డైరెక్టర్ తో అఖిల్ మూవీ ?
త్రోబ్యాక్ మ్యాజికల్ డే -అఖిల్ అక్కినేని

ఇకపై లవ్ స్టోరీస్ చేయను..!
ఇకపై రీమేక్ లు చేయను.. ఇకపై లవ్ స్టోరీస్ చేయను ఇలా పలు హీరోస్ అనడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా మరో హీరో కూడాలవ్ స్టోరీస్ చేయను అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని అఖిల్. అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూడో తరం నటుడు అఖిల్. మంచి బ్యాక్ డ్రాప్ తో ఎంట్రీ ఇచ్చినా కూడా ఫస్ట్ హిట్ కొట్టాడని చాలా టైమే పట్టింది అఖిల్ కు. వరుసగా మూడు ఫ్లాప్స్ అందుకున్న అఖిల్.. ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో మంచి హిట్‌ను అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

గోవాలో అఖిల్ 'ఏజెంట్'
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ ఫస్ట్ లుక్ ను అఖిల్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకూ లవర్ బాయ్ లా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఈ ఫస్ట్ లుక్‌లోనే విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది.

ఏప్రిల్ 5న అఖిల్ అక్కినేని ఏ జిందగీ పాట విడుదల
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’…
భారీ బడ్జెట్ తో అఖిల్ అక్కినేని 5వ సినిమా
హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అఖిల్ హీరో రూపొందుతున్న ఈ మూవీ లో పూజేహెగ్దే కథానాయిక. "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ జూన్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
అఖిల్ అక్కినేని వీకెండ్ హార్స్ రైడింగ్
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. భారీ అంచనాలు ఉన్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీబడ్జెట్ తో రూపొందనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రీ టీజర్ రిలీజ్
అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవ్వగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాటితో పాటు సిద్ద్ శ్రీరామ్ పాడిన మనసా పాట కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రిలీజ్ డేట్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , ఈషా రెబ్బా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ - వర్క్ మోడ్ లోకి అఖిల్
అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు పూజా హెగ్డే షూటింగ్ లో పాల్గొనగా.. ఇప్పుడు అఖిల్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. సెట్స్ లో ఉన్న ఫొటో ను పోస్ట్ చేస్తూ ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపాడు అఖిల్.
అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ కన్ఫామ్
మొత్తానికి రేపు పెద్ద అనౌన్స్ మెంట్ వుంది అని ఏకే ఎంటర్టెన్మెంట్స్ సస్పెన్స్ లో పెట్టగా.. ఈ రోజు సస్పెన్స్ ను రివీల్ చేసేసింది. గతకొద్ది రోజులుగా అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయినట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఏకే ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
అఖిల్ అక్కినేని న్యూ లుక్
హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక. ఈ మూవీ ని 2021 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.
మెగా డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఖరారు..?
'సైరా' తరువాత సురేందర్ రెడ్డి ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అయితే గత కొన్ని రోజులుగా సురేందర్ రెడ్డి – అఖిల్ కాంబో గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ సినిమా దాదాపుగా ఖాయం అయిపోయినట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ కథను నాగార్జునకు, అఖిల్‌కు సురేందర్ రెడ్డి వినిపించారట. ఇక కథ నచ్చడంతో సురేందర్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు అఖిల్ కోసం మంచి ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్ లో ఉండే కథను సిద్ధం చేశాడట సురేందర్ రెడ్డి. అఖిల్ క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన…
స్టైలిష్ డైరెక్టర్ తో అఖిల్ మూవీ ?
కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని "సిసింద్రీ " మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అఖిల్ "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన అఖిల్ "హలో ", "Mr మజ్ను " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్రోబ్యాక్ మ్యాజికల్ డే -అఖిల్ అక్కినేని
యంగ్ హీరో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ షూటింగ్ జరుగుతుండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. సీనియర్ హీరోయిన్ ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' క్వారెంటైన్ పోస్టర్ రిలీజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి అఖిల్ ఫస్ట్ లుక్.. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాటితో పాటు సిద్ద్ శ్రీరామ్ పాడిన మనసా పాట కూడా బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఇప్పుడు మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. క్వారెంటైన్ పోస్టర్ పేరుతో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్ చూడటానికి కాస్త రొమాంటిక్ గానే అనిపిస్తుంది. అఖిల్ లాప్ టాప్ చూస్తూ ఉంటే వెనక నుంచి పూజా హెగ్డే టీజ్ చేస్తుంది. ఈ పోస్టర్ యూత్ ను…

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రానున్న క్వారెంటైన్ పోస్టర్..!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా వల్ల సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దానితో సినిమా ప్రమోషన్స్ కూడా ఆపేసారు. అయితే అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వున్నారు. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుండి క్వారెంటైన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.
ఆగస్ట్ లో " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ టీజర్ !
అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు.