లెనిన్ ఫస్ట్ సాంగ్ విడుదల .. సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా 'లెనిన్' నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ఈరో విడుదలైంది. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన అఖిల్ మాస్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు వచ్చిన మొదటి పాట సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.వారెవ్వా అంటూ సాగే ఈపాట ను హీరోహీరోయిన్ల పై చిత్రీకరించారు.సాంగ్ లో అఖిల్ , భాగ్య శ్రీ కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. అనంత్ శ్రీరామ్ ఈసాంగ్ ను రచించగా శ్వేతా మోహన్ , జుబిన్ నౌటియల్ పాడారు. ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్ ఫీల్ తెప్పించింది.
పూర్తి వార్త చదవండి


















