ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ‘దేఖ్‌లేంగే సాలా’ సాంగ్ రిలీజ్

Dekhlenge Saala Song Out From Power Star Pawan Kalyan's Ustaad Bhagat Singh

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్-అవైటెడ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుండి సరికొత్త పాటను విడుదలచేశారు మేకర్స్. ‘దేఖ్‌లేంగే సాలా’ అంటూ సాగే ఈ పవర్‌ఫుల్ సాంగ్‌ పవర్ స్టార్ అభిమానులనే కాక మ్యూజిక్ లవర్స్ అందరినీ ఆకట్టుకునేలావుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైరల్ హిట్‌: ఈ పాటలో పవన్ కల్యాణ్ గ్రేస్, స్వాగ, సెపరేట్ స్టైల్, ఆయన హై-వోల్టేజ్ ఎనర్జీ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. దీంతో ‘దేఖ్‌లేంగే సాలా’ పాట ప్రస్తుతం యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యాజిక్: గతంలో దేవి శ్రీ ప్రసాద్ (DSP) పవర్ స్టార్ సినిమాలకు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఆయన మ్యాజిక్ రిపీట్ చేసాడని చెప్పొచ్చు. ‘దేఖ్‌లేంగే సాలా’ సాంగ్‌కి దేవి అందించిన ఫైర్ బీట్స్, మాస్ ట్యూన్ పాటను ఇన్స్టంట్ హిట్‌గా మార్చాయి.

లిరిక్స్ & వాయిస్: ముఖ్యంగా పాటలోని లిరిక్స్, బాలీవుడ్ తరహా నిర్మాణ విలువలు హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.
భాస్కరభట్ల అందించిన సాహిత్యం బీట్ కి తగ్గట్టుగా క్యాచీగా ఉంది. దీనికి తోడు విశాల్ దద్లానీ మరియు హరిప్రియ గాత్రం పాటను నెక్స్ట్ లెవెల్లో నిలిపింది.

పవన్ కళ్యాణ్-హరీశ్ శంకర్ మార్క్: ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడంతో పెరిగిన అంచనాలకు తగ్గట్టే, హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్‌ను పాత పవర్‌తో కొత్తగా చూపించడంలో విజయం సాధించారు. పాటలో విజువల్స్ పవన్ మాస్ ఇమేజ్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి.

కాగా, ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. యూట్యూబ్ లో ఈ సాంగ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని, అలాగే పవన్ కెరీర్‌లో ఈ పాట ఒక బెంచ్ మార్క్‌గా నిలిచిపోవడం పక్కా అని పవర్ స్టార్ అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక ఈ పాట ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై హైప్‌ను తారాస్థాయికి చేర్చిందని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.