ఛాంపియన్ నుండి వీడియో సాంగ్ రిలీజ్

Sallangundaale Video Song out from Champion

కొత్త తరహా కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ఛాంపియన్ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు మేకర్స్ సెకండ్ సింగిల్ సల్లంగుండాలే రిలీజ్ చేశారు. వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని, తన ఇల్లు, గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. తండ్రి ఆమెను ఓదార్చడానికి వస్తాడు. అక్కడే పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని అతను ఆశీర్వదించినప్పుడు కుటుంబం – మొత్తం గ్రామం – వివాహ వేడుకల ప్రారంభాన్ని ఈ సాంగ్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.ప్రతి కుటుంబ సభ్యుడు వివాహానికి వారు అందిస్తున్న బహుమతుల గురించి మాట్లాడే విధానం సాంప్రదాయ వేడుక సారాంశాన్ని అందంగా చూపించింది. అప్పగింతలు సమయంలో భావోద్వేగాలు అందరికి కనెక్ట్ అయ్యాయి.

మిక్కీ జె మేయర్ మ్యాజిక్ క్రియేట్ చేశారు. సల్లంగుండాలే భావోద్వేగం, వేడుక రెండింటినీ కలిగి ఉన్న మరొక అద్భుతమైన పాట. చంద్రబోస్ సాహిత్యం వివాహంలో జరిగే ప్రతి ఆచారం, భావోద్వేగాన్ని అందంగా ప్రజెంట్ చేసింది గాయకులు రితేష్ జి రావు, మనీషా ఈరబత్తిని తమ వోకల్స్ మరో మరింత అందాన్ని తీసుకొచ్చారు. బృందా గోపాల్ మాస్టర్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్ గా వుంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.