లెనిన్ ఫస్ట్ సాంగ్ విడుదల .. సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ 

First Single Released from Lenin Along with Film Release Date

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా ‘లెనిన్’ నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ఈరో విడుదలైంది. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన అఖిల్ మాస్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు వచ్చిన మొదటి పాట సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.వారెవ్వా అంటూ సాగే ఈపాట ను హీరోహీరోయిన్ల పై చిత్రీకరించారు.సాంగ్ లో  అఖిల్ , భాగ్య శ్రీ కెమిస్ట్రీ  హైలైట్ అయ్యింది. అనంత్ శ్రీరామ్ ఈసాంగ్ ను రచించగా శ్వేతా మోహన్ , జుబిన్ నౌటియల్ పాడారు. ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్  చార్ట్ బస్టర్ ఫీల్ తెప్పించింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో అఖిల్ సరసన ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సేహీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఈ చిత్రంలో ‘భారతి’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. నిజానికి మొదట శ్రీలీలను ఎంపిక చేసినప్పటికీ, కాల్ షీట్స్ సమస్యల వల్ల ఆమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారు.వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక ఇంటెన్స్ రూరల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి అదిరిపోయే బాణీలు అందిస్తున్నారు. నేడు విడుదలైన ఫస్ట్ సింగిల్ తమన్ మార్క్ మెలోడీ మరియు మాస్ అంశాల కలయికగా ఉంది.అక్కినేని నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) మరియు సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

అఖిల్ ఈ సినిమాలో తన గత చిత్రాల కంటే చాలా భిన్నమైన, రగ్డ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.ఇక  ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.  “యుద్ధం కంటే హింసాత్మకమైనది ప్రేమలో లేదు” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం మే 1న  థియేటర్లలోకి రాబోతోంది. ‘ఏజెంట్’ వంటి పరాజయం తర్వాత అఖిల్ ఈ సినిమాతో ఒక సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని అక్కినేని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.