తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతున్న సినిమా సిగ్మా.ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు.షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు వున్నాయి.బిగ్ స్కేల్, యూత్ వైబ్‌తో, సిగ్మా మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ గా మారుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కేథరీన్ థ్రెసా, సందీప్ కిషన్‌తో కలిసి స్పెషల్ సాంగ్ లో మెరవ నుండి. అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లు, నేపథ్య స్కోర్‌లకు పేరుగాంచిన ఎస్ థమన్ పవర్ ఫుల్ ట్రాక్‌ను కంపోజ్ చేశారు, ఇది సినిమాకి ఒక హైలైట్‌గా వుండనుందట. భారీ, కలర్ ఫుల్ సెట్‌లో చిత్రీకరించబడిన ఈ పాటలో సందీప్ కిషన్, కేథరీన్ థ్రెసా హై-ఎనర్జీ తో స్క్రీన్‌ను ఉర్రూతలూగిస్తుంది. సిగ్మా లో సందీప్ కిషన్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని యాక్షన్ మోడ్ లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తనదైన దారిలో నడిచే ‘సిగ్మా’ అనే మావెరిక్ హీరో చుట్టూ కథ తిరుగుతుంది. అతని పట్టుదల, సహనం, ఎవరూ ఊహించని పద్ధతుల్లో ఎదగడం థ్రిల్‌ని ఇస్తుంది. యంగ్ డైనమిక్ దర్శకుడు జేసన్ సంజయ్ సెన్సిబిలిటీలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది.తమిళ్, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ మల్టీ లింగ్వెల్ ప్రాజెక్ట్, చెన్నై, తలకోన అడవులు, థాయిలాండ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది.. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























