మెగాస్టార్ చిరంజీవి నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు.ఇందులో మరో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. ఇక సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ‘మెగా-విక్టరీ మాస్ సాంగ్’ ప్రోమో విడుదలైంది. ఈ సాంగ్ ప్రోమో ఇద్దరు దిగ్గజ హీరోల అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.కలర్ ఫుల విజువల్స్ తో పార్టీ సాంగ్ గా రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు అనిల్ రావిపూడి , ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ప్రేమ్‌లో మాస్ స్టెప్పులతో చూపించి మెప్పించనున్నారు. ఈ మాస్ నంబర్‌కు భీమ్స్ సిసిరోలియో అందించిన ఎనర్జిటిక్ బీట్స్ మరియు ఊపు ఇచ్చే సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. చిరంజీవి గ్రేస్ మరియు వెంకటేష్ టైమింగ్ కలిసి ఈ పాటను ఈ ఏడాది ‘మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా మార్చేలా కనిపిస్తున్నాయి.ఈనెల 30న ఫుల్ లిరికల్ సాంగ్ రానుంది.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఊహించని విధంగా చార్ట్ బస్టర్స్ అనిపించుకున్నాయి.
ఇక ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా చిరంజీవి, వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవ్వనున్నాయి. షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























