తన బర్త్ డే పార్టీలో పాట పాడిన దిల్ రాజు

Dil Raju’s Special Song Performance at His Birthday Bash

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు గారు నిన్న తన పుట్టినరోజు ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ వేడుకకు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈవేడుకలో దిల్ రాజు పాట పాడడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈవేడుకకు హాజరయ్యి తన దైన స్టయిల్లో పాట తో దిల్ రాజు గారికి విషెస్ తెలియజేశారు. అనంతరం దిల్ రాజు గారితో కలిసి కొత్త బంగారు లోకం సినిమాలో ని పాటపాడారు . అతి కొద్ది మంది శ్రేయోభిలాషల మధ్య దిల్ రాజు ఈ వేడుక ను జరుపుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దిల్ రాజు, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి బరిలో ఆయన పంపిణీ చేస్తున్న మరియు నిర్మిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం నిర్మాతగానే కాకుండా, ఇండస్ట్రీ సమస్యల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపే వ్యక్తిగా దిల్ రాజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక రీసెంట్ గా అఖండ 2 ను నైజాంలో పంపిణి చేసి విజయాన్ని అందుకున్నారు.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో SVC 59 తెరకెక్కుతుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ – యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ లో ఈసినిమా వస్తుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బలగం ఫేమ్ వేణు ఎల్దండి డైరెక్షన్ లో ఎల్లమ్మ కూడా రానుంది. ఇవే కాకుండా వీరి బ్యానర్ లో మరి కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు లైనప్ లో వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.