మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెకండ్ సింగిల్ గురించి తాజాగా అప్‌డేట్ వచ్చేసింది. ఈ సాంగ్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నారు. అంతకన్నా ముందు ఈ రోజు ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఫస్ట్ సాంగ్ లాగే ఈ పాట కూడా చార్ట్ బస్టర్ అయ్యేలానే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శశిరేఖ అంటూ ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను చిరంజీవి, నయనతారపై కేరళలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించగా భాను మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం సాంగ్ ను లూప్ లో వినేలా చేయడం ఖాయం.ఓవరాల్ గా ప్రోమో సాంగ్ పై అంచనాలను పెంచేసింది.ఇక ఫస్ట్ సాంగ్ మీసాల పిల్లా రీసెంట్ గా కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై 77 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి భారీ విజయాన్ని సాధించింది.
ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా క్యాథెరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి , సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























