3D లోనూ మీరు ఈ సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది – బోయపాటి శ్రీనివాస్ 

Boyapati Srinu Says Akhanda 2 3D Version Will Make Audiences Watch It Again and Again

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు, సోదర సమానులైన నందమూరి అభిమానులకు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకువెళ్లిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది ఏ స్థాయిలో ఉందనేది పెద్దలు గౌరవనీయులందరూ కూడా మాట్లాడారు. ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలబడిన దిల్ రాజు గారికి, మ్యాంగో రామ్ గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్ ఏం మ్యాజిక్ చేశారనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు. భారతదేశం ధర్మ గ్రంథాలయం. భారతదేశ ధర్మానికి తల్లి వేరు లాంటిది. దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. నమ్మని దేశాలు ఇంకోలా ఉన్నాయి. మనిషి అనుకుంటే గెలవచ్చు ఓడిపోవచ్చు. కానీ దేవుడు అనుకుంటే గెలుపు మాత్రమే ఉంటుంది. అలా దేవుడు గెలిపించిన సినిమానే ఇది.

ఈ సినిమా దేవుని సంకల్పం.దానికి మీరు అద్భుతంగా ఆదరించారు. మా ధర్మం ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం. అలా ముందుకు తీసుకొచ్చాం. అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఈ సినిమాని ఇంత అద్భుతంగా చేయగలిగామంటే కారణం బాలయ్య బాబు గారి సపోర్టు. ఆయన సపోర్ట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా చేయలేం.ఈ సినిమాని ప్రేక్షకులు మరింతగా ఆదరించి గొప్ప స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. విదేశాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా ఈ సినిమాని వాళ్ళ పిల్లలకు చూపిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాని 3Dలో కూడా రిలీజ్ చేశాం.3Dలో ఉన్న షోస్ అన్నీ ఫుల్ అయ్యాయి. 3Dలో మీరు ఈ సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అభిమానులు అందరు కూడా 3Dలో చూడాలని కోరుకుంటున్నాను. ఒక కొత్త లోకం చూస్తారు. ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతి సినిమా బాగా ఆడాలని మా కోరిక. తెలుగు పరిశ్రమ ఒక కుటుంబం లాంటిది. మనందరం బాగుంటేనే ఈ దేశంలో మనం నిలబడగలం. ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచిన తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.