పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమానుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని మొదటి పాట ప్రోమో డిసెంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది.ప్రోమో లో ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్ చెప్పనున్నారురాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రోమోలో “మీరు ప్రేమించిన, ఈలలు వేసిన పవర్ స్టార్ ఇప్పుడు మరింత ఎనర్జీ , సరికొత్త యాటిట్యూడ్‌తో రాబోతున్నారు” అంటూ చిత్ర యూనిట్ అభిమానుల అంచనాలను మరింత పెంచింది.ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
ఇక షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.ఈనెలలో సినిమాను కంప్లీట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పవన్ సరసన శ్రీలీల మరియు రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























