మాస్ మహారాజా రవితేజ,’నేను శైలజ’ ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బెల్లా బెల్లా అంటూ సాగే ఈ మాస్ డ్యూయెట్ సాంగ్ విడుదలైన దగ్గరి నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.ఇప్పటివరకు ఈసాంగ్ యూట్యూబ్ లో 7కు పైగా మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది.రీల్స్ లోనూ తెగ తిరుగుతుంది ఈ సాంగ్. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ఆకాష్ నజీజ్, రోహిణి సోరట్ గానం ఆకట్టుకోగా, పాటలోని విజువల్స్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా, హీరో రవితేజ, హీరోయిన్ల డ్యాన్స్ మరియు విదేశీ లొకేషన్లలో చిత్రీకరించిన విధానం ఈ పాటకే హైలైట్‌గా నిలిచాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.
ఇక రవితేజ ఈసారి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌గా చేసుకుని ఫ్రెష్ కంటెంట్‌తో వస్తుండడం విశేషం. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు .మొదటి పాటే ఈ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకోవడంతో, సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























