
వర్గం · 44 కథనాలు

ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్

తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

మెగాస్టార్ బర్త్ డే.. ప్రతి తరానికి ఆదర్శం 'చిరంజీవి' జీవితం

స్టార్‌డమ్, సింప్లిసిటీ కలగలిసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు

మహానటి సౌందర్య.. ఒక అజరామర జ్ఞాపకం!

ప్రైడ్ ఆఫ్ శాండల్‌వుడ్.. శివన్న

హ్యాపీ బర్త్ డే.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్

హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్..

లోకేష్ కనగరాజ్ బర్త్ డే స్పెషల్...

'హ్యాపీ బర్త్ డే త్రిష' - ఇప్పటికీ నీలో మార్పు లేదు..!

ఆయనను శంకరాభరణం తరువాతే కళాతపస్వి అనటం కరెక్ట్ కాదు

దక్షిణ భారతానికి చెందిన జాతీయ ఉత్తమ నటి పద్మభూషణ్ వహిదా రెహ్మాన్

రెండు దశాబ్దాల మాస్ మహారాజా ప్రస్థానం
వేయిపున్నముల రారాజు రెబల్ స్టార్ కృష్ణంరాజు
ఆత్మ విశ్వాస ప్రపూరితంగా సాగుతున్న దిల్ రాజు జైత్రయాత్ర

అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సంస్మరణ

విక్టరీ వెంకటేష్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ వెంకటేష్‌పై తన అభిమానాన్ని, అనురాగాన్ని వ్యక్తం చేస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్
ప్రతి సంవత్సరం అక్టోబరు 23వ తేదీ సినీ అభిమానులకు ఒక పండుగ. ఎందుకంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన ఈ 'డార్లింగ్' హీరో ప్రయాణం ఎందరికో ఆదర్శం.

తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి
సినిమా అంటే కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అదొక విశ్వాసం, అదొక బ్రాండ్ అని నిరూపించిన సృజనశీలి, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. తెలుగు గడ్డపై పుట్టి, తన అద్భుతమైన సృజనాత్మకతతో భారతీయ సినిమాను ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన వ్యక్తిగత జీవితం నుండి అంతర్జాతీయ ఖ్యాతి వరకు సాగిన అద్భుత ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.

పవన్ కళ్యాణ్ బర్త్ డే: మెగాస్టార్ తమ్ముడి నుండి డిప్యూటీ సీఎం వరకు.. లెజెండరీ జర్నీ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఆయన ఒక తరం ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన ఒక నాయకుడు, రియల్ హీరో. ఆయన జీవితం, సినీ ప్రయాణం, రాజకీయ రంగ ప్రవేశం… అన్నీ కూడా ప్రత్యేకమైనవే. నేడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయనపై స్పెషల్ స్టోరీ..
మెగాస్టార్ బర్త్ డే.. ప్రతి తరానికి ఆదర్శం 'చిరంజీవి' జీవితం
టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని, స్వర్ణయుగాన్ని సృష్టించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా, ఒక నృత్యకారుడిగా, పరోపకారిగా, రాజకీయ నాయకుడిగా మరియు బాధ్యత కలిగిన సమాజ సేవకుడిగా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. నేడు ఆయన జన్మదినం. అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, అది ఒక పండుగ.

స్టార్‌డమ్, సింప్లిసిటీ కలగలిసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు
టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రిన్స్, సూపర్‌స్టార్ మహేష్ బాబు స్టయిలే వేరు. అందంగా నవ్వుతూ, అంతకు మించిన వినయంగా కనిపించడం ఈ స్టార్ హీరో మేటి లక్షణం. తెలుగులోనే కాదు, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు సినీ ప్రస్థానాన్ని గురించి చెప్పుకుంటే, ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం. నటుడిగా ఆయన ప్రస్థానం చిన్నప్పటి నుంచే మొదలై, నేడు కోట్లాదిమంది హృదయాల్లో నిలిచిపోయేలా సాగుతోంది. మహేష్ బాబు నేడు (ఆగస్టు 9) జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై స్పెషల్ స్టోరీ..

మహానటి సౌందర్య.. ఒక అజరామర జ్ఞాపకం!
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి అరుదైన పేర్లలో ఒకటి సౌందర్య. కేవలం అందంతోనే కాదు, అద్భుతమైన నటనతో, సహజత్వంతో కూడిన అభినయంతో ఆమె తెలుగు ప్రేక్షకులను మూడు దశాబ్దాలకు పైగా అలరించారు. ఆమె చిరునవ్వు, అమాయకత్వం, భావోద్వేగాలను పలికించడంలో ఆమె చూపిన ప్రతిభ అసామాన్యం. నేడు, జూలై 18, 2025న ఆమెను గుర్తు చేసుకుంటూ, ఆమె సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిత్వాన్ని ఒకసారి చూద్దాం.

ప్రైడ్ ఆఫ్ శాండల్‌వుడ్.. శివన్న
భారతీయ సినిమా రంగంలో బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు నాలుగు దక్షిణాది భాషల పరిశ్రమలకు కూడా మెజారిటీ వాటా ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం ఇండస్ట్రీలు ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు నిర్మిస్తుంటాయి. అయితే వీటిలో శాండల్‌వుడ్‌గా పేరొందిన కన్నడ చిత్రపరిశ్రమకు ఓ స్పెషాలిటీ ఉంది. అన్ని దక్షిణాది పరిశ్రమలలో తొలితరంలో దాదాపు ఇద్దరు హీరోలు అగ్ర తారలుగా వెలుగొందారు.

హ్యాపీ బర్త్ డే.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్
ప్రభాస్.. ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై పాన్ వరల్డ్ అంతటా మార్మోగుతోంది. టాలీవుడ్ లో హీరోలు పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చిన స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి.

హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్..
పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ సినిమాలను అందించే డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. షాక్ తో డైరెక్టర్ గా ఎంట్రీ గా ఇచ్చిన హరీష్ కు రవితేజ తో తీసిన మిరపకాయ్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. షాక్ ప్రశంసలు అందుకున్న కమర్షియల్ గా అంత వర్క్ అవుట్ అవ్వలేదు. అయినా హరీష్ ట్యాలెంట్ చూసి రవితేజ రెండో సారి నమ్మి అవకాశం ఇచ్చాడు అయితే ఈ సారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హరీష్. 2011 లో విడుదలైన ఈచిత్రం ఆ ఏడాది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. హరీష్ కెరీర్ బెస్ట్ మూవీ కూడా ఇదే.

లోకేష్ కనగరాజ్ బర్త్ డే స్పెషల్...
లోకేష్ కనగరాజ్..కోలీవుడ్ లోనే కాదు ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. చేసినవి నాలుగు సినిమాలు అందులో రెండు బ్లాక్ బాస్టర్ లు ఒకటి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కావడంతో లోకేష్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్టార్ డైరెక్టర్ ఫిల్మోగ్రఫీ ఒకసారి పరిశీలిస్తే ...

'హ్యాపీ బర్త్ డే త్రిష' - ఇప్పటికీ నీలో మార్పు లేదు..!
'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై .. 'వర్షం' సినిమాతో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. గత ఏడాది తమిళ చిత్రం ‘96’లో జానకి దేవి పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ రావడంతో తెలుగులో కాస్త జోరు తగ్గినా... తమిళ్, మలయాళంలో మాత్రం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈరోజు త్రిష తన పుట్టినరోజు పుట్టిన రోజును…
90%సక్సెస్ రేట్ కలిగిన టాప్ స్టార్ అల్లు అర్జున్ అన్నది నిర్వివాదాంశం
అతను వారసత్వ హీరో అని చెప్పలేము. సాధారణంగా వారసత్వ హీరోలకు తమ తండ్రుల ద్వారా గొప్ప అభిమాన సంపద సంక్రమిస్తుంది. అయితే ఆయన తండ్రి, తాతలు సినీ ప్రముఖులే అయినప్పటికీ వారి పేరు ప్రఖ్యాతుల వల్ల ఇతని కెరీర్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే నేపథ్యమే తప్ప ఒక వారసత్వ హీరోను ఇంట్రడ్యూస్ చేయటానికి, నిలబెట్టటానికి అవసరమైనంత ప్రత్యేక ప్రయత్నాలు ఏవీ అతని విషయంలో జరగలేదు. అందుకే దశాబ్దాల చరిత్ర ఉన్న సినీ కుటుంబం నుండి వచ్చినప్పటికీ అతన్ని వారసత్వ హీరో అనలేము. వారసత్వ హీరో అయి ఉంటే హీరోగా తన మొదటి సినిమా " గంగోత్రి” లో అంత 'అండర్ డాగ్ ' క్యారెక్టర్ చేసేవాడు కాదు. భారీ తారాగణం, భారీ…

ఆయనను శంకరాభరణం తరువాతే కళాతపస్వి అనటం కరెక్ట్ కాదు
ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా ఆయన్ను నిలువునా ముంచేసింది. ప్రశంసల వెల్లువలో ఆయన నిలువునా మునిగిపోయారు. తన ఉనికి తనకే అందనంతటి అభినందనలతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆ సినిమా కంటే ముందు ఆయన 22 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో అద్భుత విజయాలను సాధించిన అపురూప చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అద్భుత సృజనకు, అమలిన ప్రేమకు, భావ సంఘర్షణకు, నైతిక , సామాజిక విలువలకు పట్టం కట్టి పట్టాభిషేకం చేసిన దిగ్దర్శకుడిగా ఆయనకు అప్పటికే గొప్ప పేరు ఉంది. కానీ జనసామాన్యానికి ఆయనంటే తెలిసింది... ఆయనేంటో తెలిసింది మాత్రం ఆ అఖండ విశ్వవిఖ్యాత విజయం తరువాతే. ఈ ఉపోద్ఘాతాన్ని బట్టి ఆ సినిమా 'శంకరాభరణం ' అనీ , ఆ దర్శకుడు…

దక్షిణ భారతానికి చెందిన జాతీయ ఉత్తమ నటి పద్మభూషణ్ వహిదా రెహ్మాన్
ఈ రోజున ఏ తెలుగు సినిమా చూసినా ఉత్తరాది భామల ఆధిపత్యమే కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఉత్తరాదిని ఏలిన అగ్ర కథానాయికలు అందరూ దక్షిణాదికి చెందిన వారే కావటం చెప్పుకోదగ్గ విశేషం. ఆలిండియా బ్యూటీ క్వీన్ హేమమాలిని, రేఖ, శ్రీదేవి, జయప్రద వంటి దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్ ను శాసించారన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. అలా ఉత్తరాదిని ఊపేసిన దక్షిణాది కథానాయికల్లో వైజయంతిమాల తరువాత స్థానం వహిదా రెహ్మాన్ దే అని చెప్పుకోవాలి. దక్షిణాదికి చెందిన ఒక హీరోయిన్ కు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ దక్కటం ఒక అరుదైన విజయ విశేషం. బాలీవుడ్ ను విశేషంగా ప్రభావితం చేసిన ఆనాటి హీరోయిన్స్ లో ఒకరైన వహీదా…

రెండు దశాబ్దాల మాస్ మహారాజా ప్రస్థానం
సినిమా రంగంలో అవకాశాల కోసం కొన్ని కోట్ల మంది పోటీ పడితే ఎవరో కొద్దిమందిని మాత్రమే అక్కున చేర్చుకుంటుంది సినిమా. ప్రయత్నించిన వారందరికీ అవకాశాలు దొరికితే ప్రపంచమంతా సినిమా మయమే అవుతుంది. " ఒక్క చాన్స్ ప్లీజ్" అంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వేలాది మంది యువకుల్లో అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం.
వేయిపున్నముల రారాజు రెబల్ స్టార్ కృష్ణంరాజు
కథానాయకుడిగా పరిచయమై ప్రతి నాయకుడిగా మారి మరలా కథానాయకుడిగా తనను తాను పునఃప్రతిష్టించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు ఈరోజు. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు ఈరోజుతో 80 వ పడి లోకి ప్రవేశించి వెయ్యి పున్నముల చంద్రోదయాన్ని తిలకించిన పూర్ణాయుష్కులయ్యారు.
ఆత్మ విశ్వాస ప్రపూరితంగా సాగుతున్న దిల్ రాజు జైత్రయాత్ర
నిర్మాత అనే పదానికి అర్థంగా, అద్దంగా నిలిచిన మహానుభావులు,మహామహుల చరిత్ర ఏనాడో ముగిసిపోయింది... గతించిన వైభవంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం 'నిర్మాత' అంటే సమూహంలో ఒంటరి. చుట్టూ ఎందరో ఉన్నా, అందరూ ఉన్నా నిర్మాత ఘోష, గోడు అరణ్యరోదనే అవుతున్నాయి. నిజానికి సినిమా అనే సప్తవర్ణ సౌధానికి మూల స్థంభమైన నిర్మాత ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. నిర్మాత మనుగడే ప్రశ్నార్థకమైన నేటి ప్రతికూల పరిస్థితుల్లో ఆత్మవిశ్వాస ప్రపూరితంగా అద్భుత విజయాలను అందిపుచ్చుకుంటున్న నిర్మాత ఒకరున్నారు. ఇండస్ట్రీలో నిర్మాతలు అందరూ చెప్పుకొని బాధపడే సమస్యలు, సవాళ్లు ఆయనకూ ఉన్నాయి. కానీ ఆయన వాటిని అధిగమించే…
నార్త్ డామినేషన్ కు బ్రేక్ వేసిన వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాస్
రానున్న నవంబర్ 11 నాటికి ప్రభాస్ తెలుగు తెరకు పరిచయమై 17 ఏళ్లు పూర్తవుతాయి.2002 నవంబర్ 11న విడుదలైన ' ఈశ్వర్' చిత్రం ద్వారా రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా పరిచయమైన ప్రభాస్ ను చూసి కుర్రాడు బాగున్నాడు... బాగానే చేశాడు... ఫర్వాలేదు... పైకొస్తాడు... ఇలాంటి అత్తెసరు మార్కుల పరిమిత ప్రశంసలు మాత్రమే వినిపించాయి. తొలి చిత్రమైన ఈశ్వర్, మలి చిత్రమైన రాఘవేంద్ర వరకు అలాంటి బొటాబొటీ మార్కులు సంపాదించుకున్న ప్రభాస్ మీద మూడవ చిత్రమైన 'వర్షం' ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది.అలా తెలుగులో ఆశించిన విజయాన్ని అందుకోవటానికి మూడవ చిత్రం దాకా నిరీక్షించిన ప్రభాస్ ఈ రోజున 'ఆల్ ఇండియా…

అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సంస్మరణ
ఈరోజు సెప్టెంబర్ 20 - మహానటులు అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం. కానీ జన్మదినాన్ని జయంతిగా జరుపుకోవలసి రావటం మన దురదృష్టం.1924 సెప్టెంబర్ 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు నిండు నూరేళ్లు జీవిస్తారని ఆశిస్తే 10 సంవత్సరాల ముందే 2014 జనవరి 22న తనువు చాలించారు.