అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సంస్మరణ

Celebrating 95th Anniversary of ANR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Akkineni Family Celebrates ANR 95th Birth Anniversary Today,HDBEverGreenANR,Akkineni Nageswara Rao 95th Birth Anniversary,ANR Latest News

ఈరోజు సెప్టెంబర్ 20 – మహానటులు అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం. కానీ జన్మదినాన్ని జయంతిగా జరుపుకోవలసి రావటం మన దురదృష్టం.1924 సెప్టెంబర్ 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు నిండు నూరేళ్లు జీవిస్తారని ఆశిస్తే 10 సంవత్సరాల ముందే 2014 జనవరి 22న తనువు చాలించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని సమస్త పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన అక్కినేని మరణం తెలుగు వారందరికీ ఒక అనూహ్య శరాఘాతం. సినిమా ప్రక్రియ శైశవ దశలో ఉన్న రోజుల్లో  “సీతారామ జననం” చిత్రం ద్వారా1944లో  హీరోగా కెరీర్ ప్రారంభించి 2014 లో విడుదలైన  “ మనం” సినిమా వరకు 70 సంవత్సరాల పాటు నటించిన సుదీర్ఘ సినీ బాటసారి అక్కినేని నాగేశ్వరరావు.

సినీరంగ ప్రవేశానికి ముందు రంగస్థలంపై ఆడ వేషాలతో మగవారి గుండెలు ఝల్లుమనేంతగా అభినయ హావాభావలు పలికించిన అక్కినేని సినిమారంగంలో మగువల మనసులు దోచుకునే ‘దొంగ రాముడు’
అవుతాడని ఎవరూ ఊహించలేదు.

పౌరాణిక, జానపద చిత్రాల హీరోగా కెరీర్ ప్రారంభించిన అక్కినేని సాంఘిక చిత్రాల తిరుగులేని కథానాయకుడిగా ఎదుగుతాడని ఎవరూ ఊహించలేదు. బాలనటుడిగా రంగస్థలంపై ముద్దులొలికే అభినయాన్ని ప్రదర్శించినందుకు చిన్న వెండి కప్పు బహుకరిస్తే ఆనందంతో ఉబ్బితబ్బిబైన  బాల అక్కినేని భారతావనిలోని సమస్త సినీ ఘన పురస్కారాల గ్రహీతగా ఎదుగుతాడనీ,వెలుగుతాడనీ ఎవరూ ఊహించలేదు.

రంగస్థలంపై ఒక్కో ప్రదర్శనకు లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ తో పాటు  అత్యధికంగా 8 రూపాయల పారితోషకం తీసుకొని మురిసిపోయిన అక్కినేని ఆసియా ఖండంలోనే అందమైన స్టూడియోను నిర్మించే స్థాయికి ఎదుగుతాడని ఎవరు కల కనలేదు.

సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగి ఇలాంటి ఊహాతీతమైన అద్భుత విజయాలను ఎన్నింటినో సాధించిన అక్కినేని నాగేశ్వరరావును తెలుగు చలనచిత్ర పరిశ్రమ యావత్తూ గొప్ప స్ఫూర్తి ప్రదాతగా గౌరవించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ మొత్తం ఒక పయనీర్  గా సన్మానించింది.  ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజానీకం మొత్తం ఆరాధ్య తారగా అభిమానించింది. ఇంతటి సుదీర్ఘ చరిత్ర, ఇంతటి స్థాన విశిష్టత, ఇంతటి కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకుని 9 పదుల నిండైన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించి అమరుడైన అద్వితీయ మహానటులు అక్కినేని నాగేశ్వరరావు 95 వ జయంతి సందర్భంగా ” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” అందిస్తున్న ఈ అక్షర సన్మానం ఆ మహా మహుడి ఘన కీర్తి కి సరితూగుతుందో.. లేదో … చూడండి.

తెలుగు చిత్ర చరితలోన
ఏడుపదుల  అధ్యాయం
అక్కినేని జీవితమే
అనుభవాల అధ్యయనం

చదువు లేదు సంధ్య లేదు
బడి ఎరుగడు గుడి ఎరుగడ
జీవితమే పాఠశాల
అనుభవమే పాఠ్యాంశం

స్వీయ లోపమెరుగుటయే
పెద్ద విద్య అన్నవాడు
స్వీయ శక్తి సాధనతో
శిఖరాగ్ర లెక్కినోడు

రంగస్థల వేదికపై
ఓనమాలు దిద్దుకొని
ఆడపిల్ల వేషాలతో
అభినయాన్ని అభ్యసించి

సినీ జగతి చరితలోన
అక్కినేని అధ్యాయం
శ్రీరాముడి వేషంతో
ప్రస్థానం ప్రారంభం

పౌరాణిక జానపద
వీరునిగా పరిచయమై
సాంఘిక కథాంశాల
తిరుగులేని నాయకుడై

వేయదగిన పాత్రలనే
ఎంచుకున్న చాతుర్యం
వేసిన ప్రతి పాత్రలోనూ
చూపించెను వైవిధ్యం

మహాకవి కాళిదాసు
తాగుబోతు దేవదాసు
అమరశిల్పి జక్కన్న
అద్భుతమొక బాటసారి

నవ యువతులు కలలు కనే
నవ  నాయక పాత్రలలో
నవరసాలు చిలికించిన
నటసామ్రాట్ అక్కినేని

వందలాది పాత్రలలో
జీవించిన మహానటుడు
అభినయ విద్యకు తానే
నిలువెత్తు నిఘంటువు

సినీ రంగ చరితలోన
బహుదూరపు బాటసారి
పరిణామాలెన్నింటినో
వీక్షించిన ఘనాపాటి

సినిమా వాడంటేనే
చిన్న చూపు జనంలోన
క్రమశిక్షణ నియమాలతో
ఖ్యాతి నింపే జగతిలోన

భరతావని  మెచ్చినట్టి
ఘన కీర్తి అక్కినేని
ఘనతలెన్నొ సాధించిన
శిఖరాగ్రం అక్కినేని

దశాబ్దాల  నట చరిత్ర
దశ దిశాంత  కీర్తి చరిత
తెలుగు వారి గుండెలలో
ఎవర్ గ్రీన్ అక్కినేని

ఇదీ… మహానటుడు, మహామహుడు మహోజ్జ్వలిత  స్థిర కీర్తి సాధకుడు అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సందర్భంగా తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం సమర్పిస్తున్న అక్షర నీరాజనం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =