లోకేష్ కనగరాజ్..కోలీవుడ్ లోనే కాదు ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. చేసినవి నాలుగు సినిమాలు అందులో రెండు బ్లాక్ బాస్టర్ లు ఒకటి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కావడంతో లోకేష్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్టార్ డైరెక్టర్ ఫిల్మోగ్రఫీ ఒకసారి పరిశీలిస్తే …
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సందీప్ కిషన్ హీరోగా ‘మానగరం’ అనే సినిమా తీసి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. ఈ చిత్రం అటు కమర్షియల్ గాను విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈసినిమా తెలుగులో ‘నగరం’ గా విడుదలైంది. ఇక ఈ సినిమా తరువాత లోకేష్, కార్తీ హీరోగా ‘ఖైదీ’ తెరకెక్కించాడు. ఈచిత్రంతో లోకేష్ పేరు మారుమోగింది. ఒక్క రాత్రి లో జరిగే కథ ని డీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక్క తమిళం లోనే కాదు తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్ళను రాబట్టుకొని బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది .
ఈ సినిమా చూసి తమిళ స్టార్ హీరో విజయ్ ,లోకేష్ కు ఛాన్స్ ఇచ్చాడు.అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘మాస్టర్’. భారీ అంచనాల తో విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను పూర్తిగా అందుకోలేదు కానీ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత లోకేష్ తన అభిమాన నటుడు కమల్ హాసన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టాడు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం విక్రమ్.
ఈ కాంబినేషన్ పై మొదటి నుంచి మంచి హైప్ ఉండగా సినిమా విడుదల తరువాత ఆ అంచనాలకు మించి విజయం సాధించింది. గత ఏడాది విడుదలైన ఈచిత్రం దాదాపు అన్ని భాషల్లో కలిపి 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టుకుంది. కోలీవుడ్ లో చాలా రికార్డు లను బద్దలుకొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా సినిమాలో రోలెక్స్ పాత్ర ను డిజైన్ చేసిన తీరు అలాగే సినిమాను ఖైదీ తో లింక్ చేసిన విధానం లోకేష్ ప్రతిభకు నిదర్శనం. ఇక ఈ సినిమాతో లోకేష్ హాట్ ఫేవరేట్ డైరెక్ట్ అయిపోయాడు.
ప్రస్తుతం లోకేష్ ,విజయ్ తో ‘లియో’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. భారీ స్టార్ క్యాస్టింగ్ తో ఈసినిమా ను తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా విజయ్ కి జోడిగా త్రిష నటిస్తుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.
ఈ సినిమా తరువాత లోకేష్ ,ఖైదీ ,విక్రమ్ సీక్వెల్స్ తో బిజీ కానున్నాడు. సో తెలుగు హీరోలతో లోకేష్ ఇప్పట్లో సినిమా చేయడమే కష్టమే. ఇక ఈరోజు ఈట్యాలెంటెడ్ డైరెక్టర్ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. హ్యాపీ బర్త్ డే ..లోకేష్ కనగరాజ్.
Join us in wishing Creative & Sensational @Dir_Lokesh a very Happy Birthday!!🥳🎉
Wishing you a MASSive Blockbuster year ahead with #LEO & can’t wait to see what's next in #LCU!!🤩🔥#HappyBirthdayLokeshKanagaraj #HBDLokeshKanagaraj #TFNWishes #TeluguFilmNagar pic.twitter.com/Y2o6m6c51p— Telugu FilmNagar (@telugufilmnagar) March 14, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.