శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా.. మహానటి సినిమా తరువాత సమంత-విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమపై మొదటి నుండి మంచి బజ్ క్రియేట్ అయింది. అప్పట్లో కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. మధ్యలో సామ్ విజయ్ వేరే సినిమాలతో బిజీ అవ్వడం.. ఆ తరువాత సామ్ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ పెండింగ్ పడింది. ఈమధ్యే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ నిర్వాణ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఖుషి సినిమా కథ రాస్తున్నప్పుడే నా మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన సమంత.. తను అయితే ఈపాత్రకు చేయగలదని అనిపించిందని తెలిపారు. ఖుషి సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.. విజయ్ దేవరకొండ తన పాత్రకు జీవం పోశాడు. ఈసినిమాలో సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి.. పవన్ కల్యాణ్ ఖుషి ఫీల్ గుడ్ సినిమాగా ఎంతో ఆదరణ పొందింది.. ఈ సినిమాలో కూడా అంతే ఫీల్ ఉందని.. అందుకే తమ సినిమాకు కూడా ఖుషి అనే పేరు పెట్టాం.. ఖుషి అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం అని క్లారిటీ ఇచ్చాడు.
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































