సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష.ఈనెల 21న పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే.ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.కొద్దిసేపటి క్రితం ఈట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.దీనికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్,దిల్ రాజు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈట్రైలర్ విషయానికి వస్తే …2:05 నిమిషాల రన్ టైం తో వచ్చిన ఈ ట్రైలర్ లో రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరులో వరస మరణాలు సంభవిస్తాయి. దానికి కారణం ఏంటి,సాయి ధరమ్ తేజ్ కు ఆ ఊరికి సంబంధం ఏంటి? చివరికి అతను ఆ ఊరికి చూపెట్టిన పరిష్కారం ఏంటి అనేది ఈసినిమా కథ. ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా వుండి సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది.విజువల్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.
విరూపాక్ష ట్రైలర్ 👇:
ఇక ఈసినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండడం మరో హైలైట్.కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సునీల్, అజయ్,బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోలో గా విడుదలకానుండడం కూడా విరూపాక్షకు కలిసి రానుంది. మరి కెరీర్ లో మొదటిసారి డీఫ్రెంట్ జోనర్ లో పాన్ ఇండియా సినిమా తో వస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈసినిమాతో ఎలాంటి ఫలితాన్ని చూస్తాడో చూడాలి.
Witness a man's Quest, Fight & his becoming of #Virupaksha 👁️💪@IamSaiDharamTej's #VirupakshaTrailer OUT NOW 👇
– https://t.co/Y5bmPe2Utd@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @NavinNooli @bkrsatish @SVCCofficial @SukumarWritings#VirupakshaOnApril21 pic.twitter.com/AGkVu2Dqdw
— SVCC (@SVCCofficial) April 11, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: