లాల్ సింగ్ చడ్డా తరువాత యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ.కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.ఇప్పటికే విడుదలైన ఈసినిమా టీజర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో కస్టడీ మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఇక కొద్దిసేపటి క్రితం ఈసినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ను విడుదలచేశారు మేకర్స్.హెడ్ అప్ హై అంటూ వచ్చిన ఈసాంగ్ పోలీసుల డ్యూటీ అలాగే వారి గొప్పతనం గురించి తెలియజేసింది.ఈసాంగ్ లో లిరిక్స్ తోపాటు మ్యూజిక్ కూడా చాలా బాగుంది.ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాయగా అరుణ్ కౌండిన్య పాడాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో నాగచైతన్య,పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండడంతో రియల్ పోలీస్ వాళ్ళతో కలిసి నాగ చైతన్య సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అరవింద స్వామి విలన్ గా కనిపించనున్నాడు.శరత్ కుమార్,వెన్నెల కిషోర్,సంపత్ రాజ్,ప్రేమ్ జీ,ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.మే 12న కస్టడీ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా విడుదలకానుంది. ఈ సినిమా తనకు బ్లాక్ బాస్టర్ విజయాన్నిఇస్తుందని నాగ చైతన్య కాన్ఫిడెంట్ గా వున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: