నాటు నాటు సాంగ్ కి కోహ్లీ డాన్స్

Kohli Dances for Naatu Naatu Song

బ్లాక్ బాస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డు ను ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించింది. దాంతో ఈసాంగ్ కి ఎక్కడ లేని క్రేజ్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ కింగ్ కోహ్లీ ఈ సాంగ్ కు స్టెప్పులు వేసాడు. నిన్న ముంబై లోని వాఖండే స్టేడియం లో ఇండియా , ఆస్ట్రేలియా ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో  స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. నాటు నాటు సాంగ్ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు వేస్తూ హుషారుగా కనిపించాడు. అది కాస్త కెమెరాకు చిక్కడం తో ఆ డాన్స్ క్లిప్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 5వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ,భారత బౌలర్ల దాటికి కేవలం 188 పరుగులకే కుప్పకూలింది. షమీ , సిరాజ్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. అనంతరం ఛేజింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అయితే రాహుల్ (75),జడేజా (45) లు కలిసి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.

 

View this post on Instagram

 

A post shared by RRR Movie (@rrrmovie)

ఇదిలావుంటే ఇంతకుముందు కోహ్లీ తోపాటు జడేజా అలాగే ఇతర ఆటగాళ్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప లోని ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ శ్రీవల్లి హిందీ వెర్షన్ పాటకు స్టెప్పులు వేసి అలరించారు. అంతేకాదు పుష్పలోని ఫేమస్ డైలాగ్ తగ్గేదెలే హిందీ వెర్షన్ డైలాగ్ ను కూడా మైదానం లో పలు సార్లు అనుకరించారు. మొత్తానికి ఈమధ్య కాలంలో నార్త్ లో కూడా తెలుగు సినిమాలకు మాములు క్రేజ్ రావడం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + five =