తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమన్నా తన అందం, అభినయంతో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీతో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తాజాగా తమన్నా ఒక బయోపిక్ మూవీకి ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ప్రభాస్ , తమన్నా జంటగా రెబెల్, బాహుబలి మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ప్రభాస్ పై తమన్నా ప్రశంసలు కురిపించారు. తనతో పనిచేసే నటీనటులు, చిత్ర యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి తెలిసిందే. షూటింగ్లో ఉన్నప్పుడు తనతో నటించే నటీనటులకు ప్రభాస్ ఇంటి నుంచే రకరకాల రుచికరమైన వంటకాలు వెళ్తుంటాయి. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రభాస్ ఆతిథ్యం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పారు. తమన్నా మాట్లాడుతూ.. ప్రభాస్ ఆతిథ్యం యూనివర్సల్ అనీ, కనీసం 30 రకాల వంటకాలు కచ్చితంగా ఉంటాయనీ, ఆయన దృష్టిలో ఇది అతిథులకు చేసే మర్యాద అనీ, తనతో కలిసి పనిచేస్తున్న వారికి ఒక ప్రత్యేక అనుభూతిని ఇవ్వడమేననీ, ఒక నిజమైన రాజుకి అసలైన నిర్వచనం ప్రభాస్ అనీ, తనకు ఎంత స్టార్డమ్ ఉంది అనే విషయాలను ప్రభాస్ పట్టించుకోరనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: