దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ మనసు దోచేసింది. ఇక ఈసినిమాతో తరువాత హన్సిక కు పలు అవకాశాలు వచ్చి తెలుగులో బిజీ అయిపోయింది. కానీ ఆతరువాత కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు రాబట్టుకొని అక్కడ కూడా బిజీ అయిపోయింది. కానీ ఈమధ్య అక్కడ కూడా కాస్త ఛాన్స్ లు తగ్గడంతో కొద్ది రోజులు సెలైంట్ గానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉంది. ఇప్పటికే పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి. మై నేమ్ ఈజ్ శృతి, 105 మినట్స్ సినిమాలు చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది హన్సిక. గాంధారి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. హార్రర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాకు కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ మాత్రం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈసినిమాలో హన్సికి డ్యూయల్ రోల్ చేస్తుంది. అంతేకాదు ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. ఫిబ్రవరి 24న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కాగా కణ్ణన్ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ప్రియుడు సొహైల్ కతురియాతో రీసెంట్ గానే హన్సిక వివాహం జరిగింది. జైపూర్‌లో వైభవంగా హన్సిక, సొహైల్ పెళ్లి వేడుక జరిగింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























