మరికొద్ది రోజుల్లో 2022 ముగిసిపోనుంది.. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాం. ఇక ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. 2020 లో అప్పుడే కరోనా ప్రభావం మొదలవ్వడం.. ఆ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండటంతో లాక్ డౌల్ ల వల్ల ఆ ఏడాది సినిమాలు రిలీజ్ కాలేకపోయాయి. గత ఏడాది కూడా అదే పరిస్థితి అయితే పరిస్థితికాస్త మెరుగుపడటంతో చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ రెండేళ్లలో పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు పలు కొత్త సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యాను. మరి ఈ ఏడాది బెస్ట్ హీరోయిన్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలియా భట్ -ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా ఈ ఏడాది రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూస్తున్నాం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అలియా భట్ రాజమౌళి సినిమా కావడంతో ఈసినిమాలో తన పాత్ర నిడివి తక్కువ అయినా కూడా నటించింది. రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటించింది అలియా భట్. అయితే అలియా పాత్ర చిన్నదే అయినా ఉన్నంత వరకూ తన ప్రెజెన్స్ మాత్రం ఆకట్టుకుంటుంది.
ఒలీవియా మోరీస్ – ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా ఈ ఏడాది రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూస్తున్నాం. ఈసినిమాలో ఎంతోమంది అంతర్జాతీయ నటీనటులు కూడా భాగమయ్యారు. ఇక ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటించింది. మొదటి సినిమా అయినా కూడా తను కూడా బాగానే ఆకట్టుకుంది.
మృణాల్ ఠాకూర్ – సీతారామం
హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక మందన్న కీలక పాత్రలో వచ్చిన సినిమా సీతారామం. పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథగా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో బాలీవుడ్ నుండి వచ్చిన మృణాల్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సీత పాత్రలో తను చేసిన నటన కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కీర్తీ సురేష్ – సర్కారు వారి పాట
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన సినిమా సర్కారు వారి పాట. బ్యాంకుల కుంభకోణంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాలో నటించిన కీర్తి సురేష్ మొదటి సారి కాస్త డిఫరెంట్ గా నటించింది. అటు యాక్టివ్ గా అలానే కామెడీగా తన పాత్రలో నటించి మెప్పించింది.
సమంత – యశోద
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది స్టార్ హీరోలతో చేసిన సమంత ఈమధ్య లేడీ ఒరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో మెప్పించిన సమంత.. ఇప్పుడు యశోద సినిమాతో మరోసారి తన సత్తా చూపించింది. ఈసినిమా ఈమధ్యే రిలీజ్ అయి మంచి హిట్ తో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది.
నజ్రియా – అంటే సుందరానికి
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా అంటే సుందరానికి. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందుకుంది. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆకట్టుకుంది. ఈసినిమాలో నజ్రియా లీలా థామస్ పాత్రలో నటించింది.
[totalpoll id=”92545″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: