డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూకేలో ప్రతీ సంవత్సరం రిలీజ్ చేసే టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సంయుక్తంగా టాప్‌లో నిలిచారు. ఈ 2022 లిస్ట్ రానున్న శుక్రవారం యూకే వీక్లీ మ్యాగజైన్ అయిన ఈస్టర్న్ ఐలో ప్రచురితమవుతుంది. ఓ ప్రాంతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించేలా చేసిన నటులుగా వీళ్లను కొనియాడింది.రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల తర్వాత పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్ రెండోస్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో బ్రిటీష్ ఇండియన్ యాక్టర్ సిమోన్ యాష్లీ ఉండగా.. నాలుగో స్థానంలో బాలీవుడ్ నటి ఆలియా బట్, ఐదో స్థానంలో పాకిస్థాన్ నటుడు ఇమాన్ వెల్లానీ నిలిచారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































