ఆదర్శ కుటుంబం అప్డేట్స్ పంచుకున్న నాగవంశీ

Naga Vamsi Shares Updates on Adarsha Kutumbam

వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మచ్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శకుటుంబం విడుదల తేదీపై వస్తున్న రూమర్లకు ముగింపు పలుకుతూ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ చిత్రం అనుకున్న సమయానికే, అంటే అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోందని ఆయన ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ అండ్ రిలీజ్ ప్లాన్‌ను నాగవంశీ వివరంగా పంచుకున్నారు. అక్టోబర్ 6న భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ చేయనుండగా, అక్టోబర్ 7 నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.అయితే ఈ సినిమాకు ఎలాంటి ముందస్తు ప్రీమియర్లు ఉండవని, అక్టోబర్ 9న నేరుగా థియేటర్లలోనే ప్రదర్శనలు మొదలవుతాయని స్పష్టం చేశారు.

దసరా సెలవులను పురస్కరించుకుని కుటుంబ సమేతంగా చూడదగ్గ పర్ఫెక్ట్ కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు నిండుగా నవ్వులను అందిస్తుందని తెలిపారు. పిల్లల పరీక్షలు ముగిశాక, హాలిడేస్‌ను తమ చుక్కాని కామిక్ రైడ్‌తో ఆస్వాదించడానికి థియేటర్లకు రావాల్సిందిగా మేకర్స్ కోరారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.