టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీస్ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి , బాలకృష్ణ , ప్రభాస్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఎన్టీఆర్ బాద్ షా మూవీ రీ రిలీజ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బ్లాక్ బస్టర్ రీ రిలీ తో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ , శృతి హాసన్ జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ రేసు గుర్రం మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో అల్లు అర్జున్ తన కామెడీ టైమింగ్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ లో అల్లు అర్జున్ , శృతి హాసన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ , బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
3 , వర్షం మూవీస్ ను రిలీజ్ చేసిన నిర్మాత నట్టికుమార్ బాద్ షా మూవీ ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అన్నీ సక్రమంగా జరిగితే రేసు గుర్రం మూవీ ని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి నట్టికుమార్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































