తేనె మనసులు (1965 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కృష్ణ 5 దశాబ్దాలలో సుమారు 350 సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునిహీరో కృష్ణ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణించారు. లక్షలాది అభిమానులను సంపాదించుకున్న ఘట్టమనేని కృష్ణ నిజమైన సూపర్ స్టార్. వెండితెరపైనే కాదు నిజజీవితంలో కూడా ఆయన హీరో. నిర్మాతల కోసం, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పని చేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
1960, 70లలో దాదాపు హీరోలు అందరూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసేవారు. కానీ, కృష్ణ 3 షిఫ్ట్ లలో వర్క్ చేస్తూ సంవత్సరానికి10 నుండి 15 సినిమాలలో నటించేవారు. 1972 సంవత్సరంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన 18 సినిమాలు రిలీజ్ కావడం విశేషం. తాను ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది అని భావించి సూపర్ స్టార్ కృష్ణ అలా సినిమాలు ఒప్పుకునేవారు. ఎవరైనా నిర్మాత తనతో సినిమా తీసి నష్టపోతే మళ్ళీ వాళ్ళకే తక్కువ పారితోషికం తీసుకొని మరో సినిమా చేసి నష్టాన్ని పూడ్చేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అనుకునే నిర్మాతలకు, దర్శకులకు పిలిచి మరీ వాళ్లకు తన డేట్స్ ఇస్తూ కృష్ణ నిర్మాతల హీరోగా పేరుపొందారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: