సార్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Dhanush Sir Movie New Release Date Fixed, Sir Movie New Release Date, Dhanush Sir Movie, Sai Kumar, Tanikella Bharani, Dhanush, Samyuktha Menon, Venky Atluri, Dhanush Latest Movie, Dhanush's Upcoming Movie, Sir, Sir 2023, Sir Movie, Sir Update, Sir Movie Update, Sir Movie New Update, Sir Movie Latest Update, Sir Movie Updates, Sir Telugu Movie, Sir Telugu Movie Latest News, Sir Telugu Movie Live Updates, Sir Telugu Movie New Update, Sir Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ధనుష్‌ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. ఇప్పటికే పలు పోస్టర్లు, ఇంకా ఒక పాటను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా సినిమా రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ముందు డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ద్వారా తెలియచేశారు.

కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =