కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘తెల్లకాగితం’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్‌ను కేటాయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రమేష్ బండ్రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం,పాఠశాల దశలో మొదలయ్యే స్వచ్ఛమైన ప్రేమ మరియు తెలిసి తెలియని వయసులో చేసే చిన్న తప్పు జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తికర కథాంశంతో రూపుదిద్దుకుంది. ఈసినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు వున్నాయి. దాంతో థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.
అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ అందించారు. సెన్సార్ పూర్తి కావడంతో గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























