పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెనాలి రామకృష్ణ BABL మూవీ తో వరలక్ష్మి టాలీవుడ్ లో అడుగుపెట్టారు. క్రాక్ , నాంది వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. వరలక్ష్మి ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, NBK107 , యశోద, హనుమాన్ , ఆద్య మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ బ్యానర్ పై అనిల్ కాట్జ్ దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ శబరి మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈమూవీ లో గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి , వైవా రాఘవ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ మేకర్స్ విడుదల చేయనున్నారు.
శబరి మూవీ మూడవ షెడ్యూల్ విశాఖలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంది. అక్కడ ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.దాంతో ఈ మూవీ మూడవ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































