హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీతారామం’. ఇక పీరియాడిక్ లవ్ స్టోరీ గా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఎక్కువ రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, క్యారెక్టర్ పోస్టర్లు ఇంకా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ అభిమానులు తమ అభిమాన హీరోని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఫైనల్ గా సీతారామం ప్రీ ఈవెంట్ కు ప్రభాస్ రావడం సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలవడం జరిగిపోయింది. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రభాస్ మాట్లాడుతూ.. సీతారామం ట్రైలర్ చూశా చాలా బాగుంది.. దుల్కర సల్మాన్ మంచి నటుడు.. మహానటి సినిమాలో ఆయన అద్బుతంగా నటించారు.. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో సినిమాలు తీయాలంటే మాములు విషయం కాదు.. హను రాఘవపూడి ఈసినిమాను ఓ పోయెట్రీలా తీశారు.. ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా.. సినీరంగంలోని వారికి థియేటరే గుడి అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇంకా ఈసినిమాలో రష్మిక మందన్నా కశ్మీరీ యువతి అఫ్రీన్ పాత్రలో సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇంకా సుమంత్, భూమికా చావ్లా, తరుణ్ భాస్కర్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగష్ట్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























