యంగ్ హీరో కార్తికేయ కొత్త చిత్రం నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ , సూపర్ హిట్ “డీజే టిల్లు “మూవీ ఫేమ్ నేహాశెట్టి జంటగా గోదావరి నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నంబర్ 3 మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు “ఉప్పెన” ఫేమ్ సానా బుచ్చిబాబు స్క్రిప్ట్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ లో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ .. హీరో కార్తికేయకు ఇదొక డిఫరెంట్ మూవీ అనీ , ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశామనీ , తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేస్తామనీ చెప్పారు.
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ .. డ్రామా ప్లస్ కామెడీ జానర్ చిత్రమిదనీ , ప్రతి ఒక్కరికీ కొత్తగా, విభిన్నంగా బతకాలని ఉంటుంది కానీ, పరిస్థితుల ప్రభావంతో సాధారణంగా జీవిస్తారనీ , ఎవరు ఏమనుకున్నా, ఎన్ని అనుకున్నా తనకు నచ్చినట్టు జీవిస్తూ… తనదైన దారిలో వెళ్లే ఓ యువకుడి కథ ఇదనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































