షూటింగ్ పూర్తిచేసుకున్న ‘సర్కారు వారి పాట’

Sarkaru Vaari Paata movie shoot wrapped up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Shooting,Sarkaru Vaari Paata latest Updates,Sarkaru Vaari Paata Movie Updates, Sarkaru Vaari Paata Movie Shoot Updates,Sarkaru Vaari Paata Shooting Wrapped Up,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Shoot Wrapped up, Sarkaru Vaari Paata Movie Shooting Wrapped Up

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్నా కూడా మరోపక్క ప్రమోషన్స్ అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందని ఒక్క పాట షూటింగ్ పెండింగ్ ఉందని తెలిపారు. ఇక ఈ గ్యాప్ లో ఆపాట షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నారు చిత్రబృందం. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. అంతేకాదు మే 12 నుంచి బాక్సాఫీస్ రివకరీ షురూ అవుతుందని కూడా ట్వీట్లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మహేష్ మేకోవర్ మార్చడం.. మళ్లీ మాస్ యాంగిల్ లోకి రావడం వల్ల ఈసినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు, బ్లాసర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మహేష్ ఖచ్చితంగా ఈసినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొడతాడన్న నమ్మకంతో ఉన్నారు. చూద్దాం అది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.