అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో తెలియదు కానీ తన టాలీవుడ్ ఎంట్రీ పై గతకొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎంట్రీపై ఎన్నో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు కు జోడీ అన్నారు.. రామ్ చరణ్ తో అన్నారు.. కానీ అవన్నీ వార్తలకే పరిమితమయ్యాయి. ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ తో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందులో కూడా నిజం లేదు. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ తెరపైకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జనగణమన సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రీసెంట్ గా లాంచ్ చేశారు మేకర్స్. అయితే ఈసినిమాలో జాన్వీ నటించనుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. అలాంటి వార్తలను నమ్మొద్దు.. అవన్నీ రూమర్లు మాత్రమే.. నేను ఇంతవరకూ ఏ తెలుగు ఇంకా తమిళ్ సినిమాకు సైన్ చేయలేదు.. ఏదైనా సినిమాను ఒప్పుకుంటే నేను కానీ చిత్రనిర్మాణ సంస్థ కానీ ఖచ్చితంగా అధికారికంగా తెలుపుతాము అని చెప్పింది. మరి ఈరూమర్లకు ఇప్పటితో బ్రేక్ పడుతుందేమో చూద్దాం..
కాగా ఇప్పటికే పూరీ తో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా.. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























