యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల రిలీజై డీసెంట్ హిట్ ను కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తన తరువాత సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసే పనిలో పడింది. ఇక దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్ కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఈ ఈసినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే వీటిలో ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ ను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈసినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఈసెట్ లోనే పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రధాన తారాగణంతో అధికభాగం షూటింగ్ ను ఇక్కడే పూర్తిచేయనున్నారట చిత్రయూనిట్.
అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























